39.2 C
Hyderabad
April 28, 2024 12: 26 PM
Slider రంగారెడ్డి

రుతుక్రమం సమయంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యం

#cbit

రుతుక్రమం సమయంలో పరిశుభ్రత పాటించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అంకురా హాస్పిటల్స్‌ కన్సల్టెంట్ డాక్టర్ మానస రెడ్డి అన్నారు. సిబిఐటి లో చైతన్య సురక్ష, ఎన్ఎస్ఎస్,  మహిళా అభివృద్ధి కేంద్రం, యెల్లో క్లినిక్‌లు  సంయుక్తం గా రుతుక్రమ పరిశుభ్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అంకురా హాస్పిటల్స్‌ కన్సల్టెంట్ డాక్టర్ మానస రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ఋతుస్రావం అనేది స్త్రీ శరీరంలో అనివార్యమైన భాగం. కానీ రుతుక్రమ సమస్యలు తరచుగా ఆరోగ్యానికి సవాలుగా మారుతాయి. కానీ జీవనశైలి మార్పులు తరచుగా స్త్రీల ఆరోగ్యంలో మార్పులకు దారితీస్తాయి. తరచుగా వ్యాయామం చేయడం ప్రారంభించడం  ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అది  రుతుక్రమంలో ఎలాంటి మార్పులను కలిగిస్తుందో తెలుసుకోవాలి అని అన్నారు.

ఋతు సమయం లో పరిశుభ్రత గురించి మహిళలకు అవగాహన కల్పించడం  ఈ సదస్సు ముఖ్య లక్ష్యం అని ప్రొఫెసర్ పి .రవీందర్ రెడ్డి,  డైరెక్టర్-స్టూడెంట్ అఫైర్స్ & ప్రోగ్రెషన్, శ్రీనివాస్ శర్మ, ప్రొఫెసర్ వై రమాదేవి,  డాక్టర్ ఎన్ ఎల్ ఎన్   రెడ్డి, ప్రొఫెసర్ ఎమ్ గణేశ్వర్ రావు,  డా.జి.విజయ లక్ష్మి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

లవర్స్: మూడు రోజులకు తేలిన మృతదేహాలు

Satyam NEWS

శోభాయాత్రకు అందరూ సహకరించండి

Satyam NEWS

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివి

Satyam NEWS

Leave a Comment