39.2 C
Hyderabad
April 28, 2024 14: 57 PM
Slider ప్రత్యేకం

మెరుగుపడిన తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి

#revanthreddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దశ తిరిగినట్టే కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయని, వారికి వారికి ఐక్యత లేదని పలు విధాలుగా ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నా ప్రజలు అవేవీ పట్టించుకునే స్థితిలో లేరనే విషయం స్పష్టం అవుతున్నది. బహుశ ఈ విషయం కాంగ్రెస్ నాయకులకే కాకుండా బయటి వారికి కూడా తెలిసినట్లుంది. ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపు అరవై స్థానాల్లో అభ్యర్థుల్ని కష్టపడకుండానే ఖరారు చేసినా మిగిలిన చోట్ల మాత్రం భారీ పోటీ నెలకొంది. ఆయా చోట్ల అభ్యర్థులు కాంగ్రెస్ లో తమకు తెలిసిన పెద్ద తలకాయలందరి దగ్గరకు వెళ్లి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడూ లేనంత పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సీనియర్లంతా తమ వర్గం వారికి టిక్కెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సామాజిక సమీకరణాలనూ చూసుకోవాలనుకుంటున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయించారు.

మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే బలమైన బీసీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసుకున్నారు. కొన్ని చోట్ల పోటీ ఎక్కువగా ఉండటంతో బుజ్జగింపులు చేస్తున్నారు. బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వడం ద్వారా ఈ సారి బీసీ ఓటు బ్యాంక్ ను గణనీయంగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

ఈ నిర్ణయం మధుయాష్కీ లాంటి నేతలకు కలసి వస్తోంది. బలమైన నేత కావడంతో ఆయనకు ఎల్బీనగర్ టిక్కెట్ ఖరారయిందన్న ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాను సిద్ధం చేసిన అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ ఆ లిస్టును అధిష్ఠానానికి చేరవేయనుంది. ఈ నెలాఖరు లేదా అక్టోబరు తొలివారంలో మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

వాయుకాలుష్యంపై ఐదు రాష్ట్రాలకు రెడ్ ఎలర్ట్

Satyam NEWS

కరోనాతో రంజీ ట్రోఫీ వాయిదా

Sub Editor

శ్రీశైల మల్లన్న హుండీల ఆదాయం 1.96 కోట్లు

Satyam NEWS

Leave a Comment