39.2 C
Hyderabad
April 28, 2024 13: 23 PM
Slider ముఖ్యంశాలు

సరైన సమయంలో ఆదాయపన్ను చెల్లించాలి

#Income tax

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పించి సరైన సమయంలో ఐటి రిటర్న్స్‌ సమర్పించేలా చర్యలు తీసుకొని, కొత్త నిబందనలపై విసృత స్థాయిలో ప్రచారం గావించడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు ఫామ్‌ 10ఎ తప్పనిసరి సమర్పించాలని ఆదాయపు పన్ను(ఎగ్జెమ్షన్స్‌) కమిషనర్‌ బి.బాల కృష్ణ తెలిపారు.

ఖమ్మం నగరం సీక్వెల్‌ రీసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కమీషనర్‌లు సదస్సుకు విశిష్ట అతిథులు ఎపి, తెలంగాణ, ఒడిస్సా ఆదాయపు పన్ను(ఎగ్జెమ్షన్స్‌) కమిషనర్‌ బి బాల కృష్ణ, ఆదాయపు పన్ను (మినహాయింపులు) హైదరాబాద్‌ రేంజ్‌ జాయింట్‌ కమీషనర్‌ వి కోటేశ్వరమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చిన వారందరూ పన్ను చెల్లించే విధంగా, ఐటి రిటన్స్‌పై అవగాహన సదస్సు పన్నుల చెల్పింపులో పారదర్శకత పెంచేందుకే సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో ఇటీవల చేసిన సవరణలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఐటి శాఖ ఆధ్వర్యంలో ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.

స్వచ్ఛంద, ధార్మిక సంస్థల ఆదాయ పన్ను మినాహాయింపులు, చెల్లింపు చట్టంలంలో చేసిన నూతన మార్పు, ఫామ్‌ 10ఎ దాఖలు చేయడానికి గడువు పొడిగింపుపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ విధానంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలను ప్రభావితం చేసే చట్టంలో కొత్త నిబంధనలను తెలియజేసారు. పన్ను చెల్పింపుల్లోను, రాయితీ పొందడంలో తలెత్తే చిక్కులను, ప్రత్యేకించి సంస్థల నిర్వహణపై ప్రభావంచూపే అంశాలపై అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేశారు.

స్వచ్ఛంద సంస్థలు సమర్పించే పత్రాలలో ఫామ్‌ 10ఎ ప్రధానమైనదన్నారు. దరఖాస్తు దాఖలు చేయడానికి గడువు పొడిగింపు వంటి ప్రధాన అంశాల మీద సుధీర్గంగా చర్చించారు. ఈనెల 30న నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయని పక్షంలో ఐటి చట్టం సెక్షన్‌ 115టిడి ప్రకారం 45 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అన్నారు. ప్రధాన ట్రస్ట్‌ మెంబర్‌ పన్ను చెల్లింపుకు బాద్యులు అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛంద, ఆద్యాత్మిక సంస్థల నిర్వాహకుల సమస్యలు, అపోహలు, అనుమానాలను నివృత్తి చేశారు.

సంస్థల నిర్వాహకుల సందేహాలకు స్పష్టమైన వివరణను ఇస్తూ సదస్సుకు హాజరైన వారికి విలువైన సమాచారం అందించారు. ధార్మిక రంగంలో ఇన్‌కంట్యాక్స్‌ చెల్లింపు, రాయితీలలో పారదర్శకతను ప్రోత్సహించడానికి శాఖ నిబద్ధతను ప్రతిబింబించేలా, నిబంధనలకు అనుగునంగా ఈ సదస్సును సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పన్నుల ఎగ్జెమ్షన్స్‌లో పూర్తిస్థాయిలో చ్కెతన్యపరిచారు. సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సామాజిక సేవలను కొనసాగించేలా ప్రోత్సాహం అందించారు.

Related posts

వీరపాండ్య కట్టబ్రహ్మన ఏకపాత్రాభినయంతో కళా స్పూర్తి కలిగించిన గుంటి పిచ్చయ్య

Satyam NEWS

ట్రంప్ వస్తున్న సమయాన సిఏఏ నిరసనల వెల్లువ

Satyam NEWS

రాజానగరం హైస్కూల్ లో దారుణం

Satyam NEWS

Leave a Comment