33.7 C
Hyderabad
April 29, 2024 00: 30 AM
Slider నల్గొండ

వేద పాఠశాలలో రెపరెప లాడిన మువ్వన్నెల జాతీయ జెండా

#veda pathasala

75వ స్వాతంత్ర్యం దినోత్సవ సందర్భంగా వేద,స్మార్త విద్యార్థులు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి పరమ పవిత్ర శ్రీ లక్ష్మీనృసింహ వేద,స్మార్త పాఠశాలలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ముందుగా పాఠశాల ఆవరణను రంగవల్లులతో తీర్చిదిద్ది,దేశ నాయకుల చిత్రపటాకు వివిధ కుసుమ మాలలతో సుందరంగా అలంకరించి దేశభక్తి, శ్రద్ధలతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనమాచరించారు. అనంతరం వేద అధ్యాపకులు చీమలపాటి ఫణిశర్మ ఘనాపాటి భారతదేశం బ్రిటిష్ బానిస సంకెళ్ల నుండి విముక్తి పొందిన విధానాన్ని, భారతీయుల దేశభక్తి,పట్టుదల,కృషి నాటి పోరాట పటిమను,త్యాగధనుల చరిత్రను వివరించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఉపాధ్యాయుడు ధూళిపాళ శర్మ స్వాతంత్ర్య సమర ఘట్టాలను కన్నులకు కట్టినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ధూళిపాళ  రామకృష్ణ,పులిజాల శంకర్రావు,మార్తి రామకృష్ణ శాస్త్రి,సుబ్రహ్మణ్యం,వేద,స్మార్త విద్యార్థులు, తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కొత్త రెవెన్యూ చట్టం న‌వ శ‌కానికి నాంది

Satyam NEWS

మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి: రైతుల్ని ఆదుకున్న కేసీఆర్

Satyam NEWS

మహిళా సాధికారతకు కేంద్ర ప్రణాళికలు ఏమిటి?

Satyam NEWS

Leave a Comment