30.7 C
Hyderabad
April 29, 2024 05: 46 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ ఆరోపణ: ఆధునిక ఆయుధాలతో పెట్రేగిపోతున్న భారత్

#ISRO

అభివృద్ధి చెందిన కొన్ని దేశాల సహకారంతో గగనతలంలో భారత్ చేస్తున్న సైనిక విన్యాసాలు పాకిస్తాన్ కు భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నాయని పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నిపుణులు అభిప్రాయపడ్డారు.

1998 లో జరిగిన అణు పరీక్షలకు 23 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇస్లామాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో పలువురు వక్తలు భారత్ గగనతలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉపయోగించడంలో అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.

ఈ సమావేశంలో స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ రాయబారి జమీర్ అక్రమ్, ఆయుధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ కమ్రన్ అక్తర్ లు పాల్గొన్నారు.

భారత్ అనుసరిస్తున్న విధానాలు ఆసియా ఉపఖండంలో అస్థిరతను పెంచుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

సైబర్ వార్ ఫెయిర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్, ఆటోమేటిక్ యుద్ధ పరికరాలను తయారు చేసుకోవడంలో భారత్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని వారు అన్నారు.

భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ కూడా రక్షణ రంగంలో భారీ ఎత్తున ఖర్చులు పెంచుకోవాల్సి వస్తున్నదని వారు తెలిపారు.   

Related posts

కరోనా వ్యాక్సిన్ వికటించడంతో డాక్టర్ కు తీవ్ర అస్వస్థత

Satyam NEWS

గణేష్ పండుగ ఆంక్షలపై విహెచ్ పి, బి జె పి నిరసన

Satyam NEWS

అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌ దే

Satyam NEWS

Leave a Comment