40.2 C
Hyderabad
May 1, 2024 18: 46 PM
Slider జాతీయం

పంజాబ్‌లో S-400 క్షిపణి వ్యవస్థ మోహరింపు

భారతదేశాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్-400 ట్రయాంఫ్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే తాజాగా రష్యా ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ఇండియాకు పంపిణీ చేసిందని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత వైమానిక దళం ఇప్పటికే పంజాబ్ సెక్టార్‌లో మొదటి ఎస్-400 స్క్వాడ్రన్ బ్యాటరీలను రంగంలోకి దించిందని సమాచారం.
ఈ తొలిబ్యాచ్ స్క్వాడ్రన్ బ్యాటరీలు పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోగలవని నివేదికలు చెబుతున్నాయి. మొదటి స్క్వాడ్రన్ డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని అంచనా.

ప్రపంచంలోని అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకునే ఎస్-400 వ్యవస్థకు డ్రోన్‌ల నుంచి బాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రతిదానిని నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉంది.

Related posts

తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే

Bhavani

గులాబీ ద‌ళానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న బీజేపీ

Satyam NEWS

వాహనం నడిపేటప్పుడు డ్రస్ కోడ్ ఉండాలా?

Satyam NEWS

Leave a Comment