40.2 C
Hyderabad
April 26, 2024 13: 17 PM
Slider మహబూబ్ నగర్

పల్లెలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

#udaykumarias

పల్లె ద‌వాఖానా కు ఎంపికైన 19 మంది వైద్యులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కుమార్ నియామక పత్రాలను అందచేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలోని ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.

వైద్య సేవలు పల్లెల్లోనే అందించాలనే ఉద్దేశ్యంతో  ప్రతిష్టాత్మకంగా పల్లె దవాఖానాలను ప్రవేశ పెట్టిందన్నారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేసి పల్లెలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ  నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్,  ఇమ్మునైజెషన్ అధికారి డా.సాయినాథ్ రెడ్డి  పాల్గొన్నారు.

Related posts

డౌట్ రైజ్డ్:అనుమాన స్పద స్థితిలో వ్యక్తి మృతి

Satyam NEWS

వైకాపా ఓట్ల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రత్తిపాటి

Satyam NEWS

మాణిక్ రావ్ ఠాక్రేతో జానారెడ్డి, పొంగులేటి భేటి

Bhavani

Leave a Comment