38.2 C
Hyderabad
April 29, 2024 11: 35 AM
Slider ఆధ్యాత్మికం

భ‌క్తుల పాలిట కొంగుబంగారం బెజ‌వాడ కనకదుర్గ‌మ్మ‌

#Indrakeeladri

బెజవాడ కనకదుర్గ అమ్మవారికి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు చాలా ప్రీతిక‌ర‌మైన‌వి. ఈ ప‌ది రోజులూ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌శావ‌తారాల‌లో భ‌క్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై సాక్షాత్క‌రిస్తుంది. ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా వేడుక‌లు ఘనంగా ఆరంభమయ్యాయి.

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌ధ్యంలో ఈ ఏడాది భ‌క్తుల ర‌ద్దీని పూర్తిగా త‌గ్గించేశారు. రోజుకు 10వేల మందికి మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని అది కూడా ముందుగా ఆన్లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న భ‌క్తుల‌నే అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించే విధంగా దుర్గ‌గుడి అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో న‌వ‌రాత్రుల మొత్తం మీద అమ్మ‌వారిని ల‌క్ష మంది మాత్ర‌మే ద‌ర్శించుకునే వీలుంది. ఉత్స‌వాల్లో భాగంగా అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్ర‌మైన మూలా న‌క్ష‌త్రం రోజున ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ్మ‌వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్తిస్తారు.

తొలి రోజు విజయవాడ పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముగింపు సంద‌ర్భంగా విజ‌య‌ద‌శ‌మి రోజున దుర్గాదేవిని హంస‌వాహ‌నంపై ఊరేగిస్తారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే ఈ తెప్పోత్స‌వాన్ని తిల‌కించేందుకు ఈ ఏడాది ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

దుర్గాదేవి వృత్తాంతం

ప‌ర‌మ దుర్మార్గుడైన మ‌హిషాసురుడి బారినుంచి దేవ‌త‌ల‌నూ మ‌నుషుల‌నూ ర‌క్షించేందుకు ఘోర యుద్ధం చేసి అత‌డిని వ‌ధించింది దుర్గాదేవి.

ఆ స‌మ‌యంలో మ‌హోగ్రంగా క‌నిపిస్తున్న ఆ త‌ల్లిని చూసిన దేవ‌త‌లంద‌రూ అమ్మా నీవు లోకాల‌ను ర‌క్షించే త‌ల్లివి .. ఇంత‌టి ఉగ్ర రూపం మ‌హిషాసురుని వంటి రాక్ష‌స‌వ‌ధ‌కే గానీ మేమెట్లా భ‌రించ‌గ‌లం, శాంత రూపిణివై లోకాల‌ను కాపాడ‌మ‌ని వేడుకున్నారు.

అప్పుడా త‌ల్లి క‌రుణార‌స సంపూర్ణ అయిన రాజ రాజేశ్వ‌రీ దేవిగా అవ‌త‌రించింది. నాటి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌ర‌మూ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి మొద‌లు న‌వ‌మి వ‌ర‌కూ జ‌రిగే శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాల‌లో న‌న్ను ఆరాధించిన వారికి ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలూ, సుఖ శాంతులూ క‌లుగుతాయ‌ని వ‌ర‌మిచ్చింది.

అయితే అనంత రూపిణి అయిన అమ్మ‌వారిని ఏ రూపంలో అర్చించాలీ అని మార్క‌డేంయ మ‌హ‌ర్షికి ఓ సందేహం వ‌చ్చింది. నేరుగా బ్ర‌హ్మ‌దేవుడిని క‌లిశాడు. దాంతో సాక్షాత్తూ సృష్టిక‌ర్తే న‌వ‌దుర్గా రూపాల‌ను వ‌ర్ణించాడు.

జ‌గ‌న్మాత స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును సృష్టించేందుకు శ్రీదుర్గ‌, మ‌హాల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి, గాయ‌త్రి, శార‌దాదేవి రూపాల‌ను ధ‌రించింది. ఈ పంచ రూపాల‌లో అది ప్ర‌కృతిస్వ‌రూపం క‌నుక దుర్గ‌మ్మ మహిషాసురుణ్ని స‌హ‌రించిన త‌రువాత ప‌విత్ర కృష్ణా తీరంలోని ఇంద్ర‌కీలాద్రిపై స్వ‌యంభువుగా అవ‌త‌రించింది.

సాధార‌ణ రోజుల్లో కంటే ఈ ప‌ది రోజుల్లో క‌న‌క‌ప్ర‌భ‌ల‌తో వెల‌సిన దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు కోటి రెట్లు పుణ్యం ద‌క్కుతుంద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.

Related posts

త్వరలో ప్రేక్షకుల ముందుకు ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్`

Satyam NEWS

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ

Satyam NEWS

బీ అలెర్ట్: వైన్స్ లు మూత ముందే కొనుక్కోండి

Satyam NEWS

Leave a Comment