41.2 C
Hyderabad
May 4, 2024 17: 35 PM
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో వైసీపీ దళిత ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే అవమానం

#artur

అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో వైసీపీ దళిత ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే అవమానం జరిగింది. మంత్రి ఆర్ కె రోజా పర్యటన ఫ్లెక్సీల్లో  ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోలు కనిపించలేదు. సొంత నియోజకవర్గంలో జరిగే మంత్రి అధికారిక పర్యటన సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో తన ఫోటో వేయనందుకు అవమాన భారంతో సదరు దళిత ఎమ్మెల్యే రోజా పర్యటనకు దూరంగా వున్నట్లు సమాచారం. ఈ ఘటన జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజక వర్గంలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్… శాప్ చైర్మన్ బైరెడ్డి శిద్దారెడ్డి వర్గాల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నియోజక వర్గానికి మంత్రి రోజా వస్తున్నప్పుడూ గతంలో మాదిరిగా ఫ్లెక్స్ వార్‌ కనిపిస్తోంది. నియోజకవర్గంలో హవా చూపిస్తున్న బైరెడ్డి వల్ల వరుస అవమానాలు ఎదురవుతున్నాయన్నది ఆర్థర్ భావన. అందుకే శనివారం రోజాతో పాటు పాల్గొనాల్సిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రికి స్వాగతం పలికే ఫ్లెక్సీల్లో ఆర్థర్‌ పేరు, ఫోటో కనిపించకపోవటంతో వివాదం మొదలైంది. దీంతో శనివారం అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆర్థర్‌ దూరంగా ఉంటున్నారు.

గతంలోనూ ఇరిగేషన్ మంత్రి వచ్చినప్పుడు సేమ్ సీన్ కనిపించింది. తనకు అన్ని అవమానాలే జరుగుతున్నాయని సన్నిహితుల వద్ద ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎమ్మెల్యే ఆర్థర్‌కి, శాప్ చైర్మన్‌గా ఉన్న భైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి అసలు గిట్టడం లేదు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ముఖ్యనేతలు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ విభేదాలు రోడ్డెక్కుతున్నాయి. గతంలో అనిల్‌ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహా ఘటన జరిగింది.

ఇప్పుడు రోజా వస్తున్నప్పుడూ అదే ఫ్లెక్స్ వార్‌ కనిపిస్తోంది. నియోజకవర్గంలో హవా చూపిస్తున్న బైరెడ్డి వల్ల వరుస అవమానాలు ఎదురవుతున్నాయన్నది ఆర్థర్ భావన. అందుకే రోజాతో పాటు పాల్గొనాల్సిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా పలు నియోజక వర్గాల్లో అంతర్గత పోరు ముదిరి పోతోంది. సీఎం జగన్ రెడ్డి స్వయంగా కలుగ జేసుకుని వాటిని సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా ముడి పడడం లేదు. ఎదురవుతున్న అవమానాలతో మనస్తాపం చెందిన దళిత ఎమ్మెల్యే ఆర్డర్ చివరకు రానున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు కూడా ఇష్ట పడడంలేదని సమాచారం.

Related posts

డ్రగ్స్ పై పోరాటం కొనసాగిస్తాను: పట్టాభి

Satyam NEWS

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

Satyam NEWS

పాత లిఫ్టుల ఆధునీకరణ, కొత్త లిఫ్టులు మంజూరుకు అభినందనలు

Satyam NEWS

Leave a Comment