38.2 C
Hyderabad
April 27, 2024 16: 25 PM
Slider సినిమా

ఆది టాప్ గేర్ ఫస్ట్ లుక్ 3D మోషన్ పోస్టర్ విడుదల

#adisaikumar

ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. ఈ సినిమా పేరే టాప్ గేర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

వేలాది మంది స్టూడెంట్స్ నడుమ టాప్ గేర్ టైటిల్ లోగో లాంచ్ చేసి యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ లుక్ చూస్తుంటే సినిమాలో ఏదో తెలియని పాయింట్ టచ్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే కాస్త వినూత్నంగా ఆలోచించి తొలిసారి 3D మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. టాప్ గేర్ అనే టైటిల్ కి తగ్గట్లుగా హీరో ఆది సాయి కుమార్ తో ఈ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ఈ వీడియోలో ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. 

ఇప్పటిదాకా విడుదల చేసిన అప్ డేట్స్ చూస్తుంటే ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. 

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. చిత్రానికి K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ”జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా” లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో  బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు

ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  

టెక్నీషియన్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్, మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రామాంజనేయులు, కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి, బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్, ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్, పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని

Related posts

మంచి శ‌క్తుల పోరాటంతోనే దుష్ట శ‌క్తుల అంతం!

Sub Editor

2020లో 203 ఉగ్ర‌వాదులు హ‌తం… పాక్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌దా?

Sub Editor

తిరుమల భక్తుల దర్శనానికి ఆటంకం లేదు

Satyam NEWS

Leave a Comment