38.2 C
Hyderabad
April 28, 2024 19: 06 PM
Slider మహబూబ్ నగర్

దగ్గరుండి కులాంతర వివాహం చేసిన దళిత గిరిజన నాయకులు

#MalaMahanadu

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జాండ్ర (BC.B) కులానికి చెందిన బండ రాజు లంబాడ తెగకు చెందిన వి.సునిత లకు పెద్దలు కాదన్నా కులపెద్దలు దగ్గరుండి వివాహం జరిపించారు. గత మూడు సంవత్సరాల నుండి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

అయితే వారి ప్రేమను ఇరుకుంటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దాంతో వారు తెలంగాణ మాలమహానాడు, గిరిజన సేవా సంఘం నాయకులను ఆశ్రయించారు. పూర్వాపరాలు విచారించిన తర్వాత వారు ఇరు కుటుంబాల పెద్దలకు రాజీ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు.

దాంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయం లో హిందూ సాంప్రదాయ బద్ధంగా దగ్గరుండి ప్రేమ జంట కు వివాహం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య, గిరిజన సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్,

తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడం బాల్ రాజ్, రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం త్వరగా ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు.

Related posts

ఈటెలకు మతి స్థిమితం లేదు

Satyam NEWS

మానవత్వం తలదించుకునే సందర్భం ఇది

Satyam NEWS

బీజేపీ గూటికి వైసీపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి

Satyam NEWS

Leave a Comment