31.7 C
Hyderabad
May 2, 2024 09: 55 AM
Slider ముఖ్యంశాలు

23 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

inter practicals‌ from 23rd

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,57,393 మంది అభ్యర్థులు హాజరుకానుండగా. 1,882 పరీక్షా కేంద్రాలను ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో 2,57,081 జనరల్‌ కేటగిరి అభ్యర్థులుండగా, మరో 312 మంది జాగ్రఫీ అభ్యర్థులున్నారు.

ఒక కాలేజీ అధ్యాపకులకు మరో కాలేజీలో ఎక్స్టర్నల్‌ ఎగ్జామినర్లు గా నియమించారు. ఏ రోజు జరిగిన పరీక్షలకు సంబంధించిన మార్కులనను  అదే రోజు బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఏర్పాట్లు చేసింది. పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయగా, మంగళవారం నుంచే ఈ కంట్రోల్‌రూం సేవలందిస్తుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు.

విధ్యార్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం 040 -24600110 ఫోన్‌ నంబర్‌, హెల్ప్ డెస్క్  ఈమెయిల్‌ను సంప్రదించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసే ఈ కంట్రోల్‌రూం సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

Related posts

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణం

Satyam NEWS

కూలిన మిగ్-21 జెట్.. వింగ్ కమాండర్ మృతి

Sub Editor

గిల్టీ:భార్యను చితక బాది కేసుల భయంతో భర్త ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment