40.2 C
Hyderabad
April 29, 2024 15: 19 PM
Slider నెల్లూరు

వి యస్ యూ లో అంతర్జాతీయ యువజన దినోత్సవం

#vikrama simhapuri

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం, నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా  అంతర్జాతీయ యువజన దినోత్సవం ఘనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయకృష్ణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆవిర్భావం గురించి ముఖ్యఉద్దేశాల గురించి విపులంగా వివరించారు. ఈ సంవత్సరపు ముఖ్య అంశమైనా ఆహారపర్యావరణ వ్యవస్థ పరివర్తన, యువత ఆవిష్కరణలు మానవ మరియు గ్రహ ఆరోగ్యం అనే అంశం మీద యువతకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరు సామాజిక స్పృహతో పాటు తమ భవిష్యత్తును దిశానిర్దేశించుకోవాలని కోరారు. అందరు తాము ఎదుగుతూ ఇతరుల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో యువత వినూత్న ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

జిల్లా యువజనాధికారి పౌష్టికాహార ఆవశ్యకత గురించి, క్రీడల ప్రాముఖ్యత గురించి  విపులంగా చర్చించారు. ఎన్ యస్ యస్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం మాట్లాడుతూ యువత దయతో ఒకరిపట్ల ఒకరు ప్రేమతో కలిసి మెలిసి సమాజశ్రేయస్సుకు పాటుపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యస్ వాలంటీర్లు,ఎన్ యస్ యస్ సిబ్బంది, నెహ్రూయువకేంద్ర వాలంటీర్లు, స్వచ్చంద్ర సేవా సంస్థలు పాల్గొన్నాయి.

Related posts

కేసీఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడాలి

Satyam NEWS

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడికి సన్మానం

Satyam NEWS

ఫీజులు గుంజుతున్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్య

Satyam NEWS

Leave a Comment