33.7 C
Hyderabad
April 30, 2024 02: 54 AM
Slider కడప

పాత్రికేయుల కుటుంబ సంక్షేమమే శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ లక్ష్యం

#pressclub

రాజంపేట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులతో పాటూ వారి కుటుంబాల సంక్షేమమే శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ లక్ష్యం అని అధ్యక్షుడు  సూర్యనారాయణ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్జీవో హోమ్ లో శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట లో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రెస్ క్లబ్ ఇప్పటి వరకు ఎవరి వద్ద నిధులు వసూలు చేయలేదని,అలా ఎవరూ చేసినా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము అలాంటి వసూళ్లకు విరుద్ధమని తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం పునః నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి,జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి ల సహాయంతో నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రెస్ క్లబ్ పూర్తి చేయడంతో పాటూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలాల మంజూరుకు ప్రాసెస్ జరుగుతోందని అన్నారు. అనంతరం పాత్రికేయులకు ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ  చేశారు.

డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి తో బేటీ

అనంతరం రాజంపేట డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శివబాస్కర్ రెడ్డితో శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ కార్యవర్గం బేటీ అయ్యారు. అర్హులైన ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్ వాహనాలకు హోలో గ్రామ్ తో కూడిన స్టిక్కర్ ఇవ్వాలని జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఆర్డీవో తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిఎస్పీ హామీ ఇచ్చారు. ఆయన చేతులు మీదుగా లాంఛనంగా ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ చేశారు.

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సత్కారం

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ కార్యవర్గంకు కౌన్సిలర్ సనిశెట్టి నవీన్ కుమార్ గుప్తా,అధ్యక్షులు గందే సత్యనారాయణ గుప్తా,మాజీ అధ్యక్షులు వెల్చురి అశోక్ బాబు శాలువాలతో సత్కారం చేసి,అమ్మవారి లడ్డు ప్రసాదం అంద జేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ నిర్వహకులు ఉపాధ్యక్షుడు ఐ. సి.వెంకట రెడ్డి, కార్యదర్శి బాస్కర్,కోశాధికారి పాబోలు ప్రకాష్,సహాయ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి,అలీ షేర్,ప్రత్యేక ఆహ్వానితులు దార్ల శ్రీనివాసులు ఆచారి,కూరాకు శ్రీను,కార్యనిర్వాహక కార్యదర్శులు మద్దికేర ఓబులేసు, కార్యవర్గ సభ్యులు  కలాంజలి అప్పారావు, జి.వి.పి.అర్. కె.రాయల్,నరేష్, మందా శివయ్య, కొర్రపాటి నాగరాజు ఆచారి, నాగరాజు, రమణ, దివాకర్, రవికుమార్,యనాదయ్య, సునీల్,హరిబాబు, బాబు,చామంచి సుబ్బయ్య, బి.చంద్ర శేఖర్,కడవ కూటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రికార్డు స్థాయిలో ఎన్.టి.ఆర్ స్మారక నాణెం అమ్మకాలు

Satyam NEWS

కరోనా నేపథ్యంలో ఆందోళనలో వాలంటీర్లు

Satyam NEWS

మారిన వాతావరణం.. చల్ల బడిన విజయనగరం..!

Satyam NEWS

Leave a Comment