28.7 C
Hyderabad
April 28, 2024 05: 20 AM
Slider విజయనగరం

పోలీసు సంక్షేమానికే ఐఓసీఎల్ పెట్రోల్ బంకు నిర్మాణం

#IOC Petrol Bunk

ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం సబ్ డివిజన్ ఎస్పీ కార్యాలయం సమీపంలోని పోలీసు క్వార్టర్స్ స్థలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్మించనున్న పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకుకు జిల్లా ఎస్పీ రాజకుమారి శంకు స్థాపన చేసారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సంక్షేమానికి కొద్ది మొత్తంలో మాత్రమే నిధులు మంజూరు కావడంతో, జిల్లా పోలీసు శాఖను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కొన్ని వాణిజ్య నిర్మాణాలు చేపట్టి, వచ్చిన ఆదాయంను పోలీసు సంక్షేమానికి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నామన్నారు.

ప్రజలకు పోలీసు వాహనాలకు నాణ్యమైన పెట్రోలు

పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు దరఖాస్తు చేయగా, రేంజ్ డీఐజీ రంగారావు చొరవతో త్వరితగతిన డీజీపీ ఆఫీసు నుండి అనుమతి లభించిందన్నారు.

ఐఓసీఎల్ వారు పోలీసు స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో పెట్రోల్ బంకు నిర్మాణం చేపట్టి, నాణ్యమైన పెట్రోలును పోలీసు వాహనాలకు, ప్రజలకు ఇస్తామని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని పోలీసుల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు.

ఐఓసీఎల్ డీజీఎం కుంతల్ ముఖర్జీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 35వేల పెట్రోలు బంకులు ఐఓసీఎల్ కు ఉన్నాయన్నారు. పోలీసుశాఖకు అన్ని విధాలు సహాయ, సహకారాలను అందించి, అత్యాధునిక సౌకర్యాలతో 1.20 కోట్ల వ్యయంతో పెట్రోల్ బంక్ ను తక్కువ వ్యవధిలో నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామన్నారు.

అంతకు ముందు వేద పండితులు పూర్ణ కుంభంతో జిల్లా ఎస్పీ రాజకుమారికి స్వాగతం పలికి, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఐఓసిఎల్ పెట్రోలు బంకు నిర్మాణంకు జిల్లా ఎస్పీ శంకు స్థాపన చేసారు.

పోలీసు అధికారులకు ఎస్ పి అభినందనలు

పెట్రోల్ బంకు నిర్మాణంకు అనుమతులు త్వరితగతిన తీసుకురావడానికి కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

అదే విధంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ సమీపంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి విచ్చేసే ప్రజలు సౌకర్యవంతంగా స్పందన ఫిర్యాదు కేంద్రానికి చేరేందుకు అనుకూలంగా పోలీసుల శ్రమదానంతో సిమెంట్ రోడ్డును నిర్మించగా, ఆ మార్గానికి స్పందన మార్గంగా నామకరణం చేసిన జిల్లా ఎస్పీ రాజకుమారి అలాగే విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీగార్ని కలిసేందుకు వచ్చే సందర్శకులు, వేచి ఉండేందుకు సరైన గది లేక ఇబ్బంది పడుతుండేవారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని, సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఆధునీకరించి, సందర్శకులు వేచి ఉండేందుకు అనుకూలంగా సోఫాలను ఏర్పాటు చేసారు. అదే విధంగా సందర్శకులు చదువుకొనేందుకు కొన్ని పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు.

ఆధునీకరించిన విజిటర్స్ గదిని జిల్లా ఎస్పీ రాజకుమారి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ.సత్యన్నారాయణ రావు, ఒఎ. ఎస్. సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ, ఎన్ఏబి ఎన్.శ్రీదేవీరావు, పీటీసీ ప్రిన్సిపాల్ రామచంద్రరాజు, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు,

పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ మెహర్ బాబా, డీపీఓ ఎఓ వెంకట రమణ, ఐఓసి ఎల్ డిజిఎం కుంతల్ ముఖర్జీ, సేల్స్ ఆఫీసర్ సాయి ప్రకాష్, మేనేజరు సంపత్ కుమార్, సీఐలు మురళి, నీహెచ్. శ్రీనివాసరావు, టీఎస్ మంగవేణి, ఎర్రంనాయుడు, ఆరైలు నాగేశ్వరరావు, రమణమూర్తి, పి. ఈశ్వరరావు, చిరంజీవ రావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టండి

Satyam NEWS

అనథర్ యాంగిల్:నయీమ్ మేనకోడలుసాజీదా మృతిపై అనుమానాలు

Satyam NEWS

పాక్ లో ఆర్ధిక సంక్షోభం: ప్రత్యర్థుల అరెస్టుల్లో పాలకులు బిజీ

Satyam NEWS

Leave a Comment