32.7 C
Hyderabad
April 27, 2024 01: 13 AM
Slider నల్గొండ

ఎగొనీ: ఎంపిక అయిన కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వరా?

#Hujurnagar Congress Party

కానిస్టేబుల్ గా నియామకమై కూడా శిక్షణకు నోచుకోకుండా ఉన్న 4203 మంది (TSSP) మనోవేదనను వెంటనే పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అజీజ్ పాషా కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందిరా భవన్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అజీజ్ పాషా మాట్లాడుతూ 2018లో రాష్ట్ర ప్రభుత్వం 18 వేల వన్ ఎస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చిందని, లక్షలాది మంది అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.

అందులో రాత పరీక్షలు, శారీరక పరీక్షలు, పరుగు పరీక్షలు ఇలా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారని ఆయన అన్నారు. వారిలో 18 వేల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని, ఇందులో 4203 మంది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకం అయ్యారని ఆయన అన్నారు.

శిక్షణ విషయంలో స్పందించని ప్రభుత్వం

ఏఆర్ సివిల్ అభ్యర్థులకు మాత్రం ప్రభుత్వ శిక్షణ ఇస్తుందని అయితే TSSP పోలీస్ అభ్యర్థులకు శిక్షణకు సంబంధించిన సమాచారం నేటి వరకు లేదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం కానీ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పట్టించుకోవడంలేదని అన్నారు.

దాంతో ఎంపికయిన అభ్యర్ధులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారు వేరే పని చేసుకుందామంటే ఏమైనా సమస్యలు ఉత్పన్నమై మెడికల్ గా అనర్హులను అవుతానేమో అని భయంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఉద్యోగాలు ఉండి కూడా నిరుద్యోగులుగా ఉండటంతో వారి మనోవేదన వర్ణనాతీతంగా ఉందని ఆయన అన్నారు.

నియామక అభ్యర్థులకు నియామకం జరిగిన నాటి నుండి శిక్షణ పూర్తి అయ్యేవరకు జరిగిన కాలాన్ని అభ్యర్థులకు సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, సుతారి వేణుగోపాల్, జగన్, రాము, గోపి, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పండగలా ప్రారంభమైన పాఠ్యపుస్తకాల పంపిణీ

Satyam NEWS

పెంబర్తి వద్ద అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు లారీఢీ

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణంలో బిజెపి బలోపేతానికి కృషి

Satyam NEWS

Leave a Comment