40.2 C
Hyderabad
April 28, 2024 15: 14 PM
Slider సంపాదకీయం

‘దేశం’ తో కలిసిన వారాహీ యాత్రతో జగన్ గుండె గుభేల్

#chandrababu

ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ఒక పార్టీ శ్రేణులు,  కొత్తగా బలపడుతున్న మరో పార్టీ కేడర్‌ తో కలిసి అడుగులు వేయడం అంత సులువైనదేమీ కాదు. తమకు గుర్తింపు దక్కలేదని ఒక పార్టీ నేతలు, తమను తొక్కేస్తున్నారని మరొక పార్టీ అభిమానులు తన్నుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పడు  తెలుగుదేశం – జనసేన నాయకులు, శ్రేణుల మధ్య అలాంటి చిక్కులెక్కడా ఎదురుకాకకపోవటం ఆసక్తికర పరిణామం. పొత్తులు లెక్కలు తేలక ముందే జనసేన – టీడీపీ కలసిపోవాలన్న అద్భుతమై ఆలోచనతో భవిష్యత్‌ లో ఎదురయ్యే ప్రమాదాలకు ముందే చెక్‌ పెట్టినట్టయింది. ఎన్నికల ముందే ఈక్వేషన్స్‌ సెట్ అయితే  ప్రత్యర్థిని దెబ్బతీయటం ఈజీ అన్న ప్లాన్‌ లో భాగంగానే తెలుగుదేశం ఇలా అడుగులు ముందుకేస్తోంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిని జగన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబునాయుడిని కలిసిన అనంతరం క్షణం కూడా ఆలశ్యం చేయకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు. దాంతో జగన్ రెడ్డి గుండెల్లో ఒక్క సారిగా ఆందోళన చెలరేగింది. తాను ఆశించనట్లు తెలుగుదేశం పార్టీ నిరాశలో కూరుకుపోకుండా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నది.

ఈ దశలో జరుగుతున్న పవన్‌ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రత్యేకత సంతరించుకుంది. వారాహి యాత్రకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకరించాలని, కలిసికట్టుగా విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో నాలుగో విడత యాత్రను ప్రారంభించిన తొలి రోజే ఈ ప్రభావం కనిపించింది. దాంతో విషయం జగన్ రెడ్డికి బోధపడిపోయింది.

వ్యూహం ఏదైనా కావచ్చు.. కానీ పవన్‌ కళ్యాణ్‌కు ఈ నాలుగో విడత యాత్ర నిస్సందేహంగా అంతకంటే రెట్టింపు బలానిస్తుంది. పార్టీకి పెద్దదిక్కు జైల్లో ఉన్నా లోకేశ్‌, బాలయ్యలు  జనజేన పొత్తుతో ఎదురయ్యే పరిణామాలు, ఎదుర్కోవాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాక అధినేత ఆదేశాలతో తమ కేడర్‌ను సైతం  జనసేనతో కలసిపోయేలా పక్కా ప్లాన్‌ తో టీడీపీ అడుగులు ముందుకేస్తోంది. ఇందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కేడర్‌ ను కూడా జనసేన సైన్యంతో కలసి వారాహియాత్రలో పాల్గొనాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం ఆసక్తికరపరిణామం. ఇప్పటికే తమ అధినేతను జైల్లో పెట్టించిన  జగన్‌ పై కత్తులు దూస్తున్న టీడీపీ కేడర్‌ జనసేన సైన్యంతో కలసి పోవడం 2024 ఎన్నికలకు ముందు ఓ ఆసక్తికర పరిణామం.

చంద్రబాబు డైరెక్షన్‌ లో లోకేశ్‌, బాలయ్యలు తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత  రెండు పార్టీల నేతలు కొత్త ఉత్సహాన్ని ప్రకటిస్తున్నారు.  అదే జోష్‌..  అవనిగడ్డలో మొదలైన నాలుగో విడత వారాహియాత్రలోనూ కనిపించింది.  కళ కోల్పోతుందంటూ  తెలుగుదేశం పార్టీపై చిందులు తొక్కుతున్న జగన్‌ అండ్‌ కో కు ఇదో పెద్ద షాక్‌ అని ఎనలిస్టుల విశ్లేషణ.  ఇదే ఉత్సాహం  మిగతా  చోట్ల జరిగే వారాహి యాత్రల్లోనూ కొనసాగితే 2024 ఎన్నికల్లో విజయం కష్టమేమీ కాదని వారి అభిప్రాయం.   ఈ కలయిక ద్వారా ప్రత్యర్థులకు కొత్త సంకేతాలూ పంపే అవకాశాలు లేకపోలేదని ఇప్పడే వారంతా ఓ అంచనాకొచ్చేస్తున్నారు.

Related posts

వైసీపీ ప్రభుత్వం పై ఓర్వలేక చంద్రబాబు కుట్ర

Satyam NEWS

బ్రాహ్మణపల్లె శివారులో పేకాట రాయుళ్ల అరెస్టు

Satyam NEWS

పాలేరులో పోటీచేస్తా… అవకాశమివ్వండి

Bhavani

Leave a Comment