30.2 C
Hyderabad
September 14, 2024 16: 20 PM
Slider సినిమా

బాబా భాస్కర్‌ కు చదువు రాదా?

baba bhaskar

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 లో ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌లో బాబా భాస్కర్‌ ఓంట్లు రాక,ఎబిసిడిలు చదువ లేక చాలా ఇబ్బందిపడుతూ 8 వ తరగతి వరకే చదువుకున్నాను గురువు గారు మీరు ఇలాంటి పరీక్షలు పెడితే ఏలా అంటూ  బిగ్‌ బాస్‌ను ను కన్ఫ్యూజన్‌లో పెట్టాడు. బాబా మాస్టర్‌ను సీక్రెట్‌ రూమ్‌కి పిలిచాడు బిగ్‌ బాస్‌. అక్కడ కొన్ని తినే పదార్థాలు పెట్టారు. వాటిని తిన్న తర్వాత డ్రింక్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఒకటి నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టాలని సూచించాడు. అవి పూర్తయ్యాక మళ్లీ వంద నుంచి ఒకటి వరకు వెనుకకు లెక్కబెట్టాలని కోరాడు. అయితే, మధ్యలో కొన్ని అంకెలను వదిలేశాడు బాబా బాస్కర్‌ మాస్టర్‌. అంతటితో అయిపోలేదు. ఆ తర్వాత ఏబీసీడీలు వచ్చా అని బాబా మాస్టర్‌ను బిగ్‌ బాస్‌ అడిగాడు. అయితే, తనకు రావని చెప్పినా వినలేదు. ఏబీసీడీలను వెనుక నుంచి చెప్పాలని ఆర్డర్‌ వేశాడు. దీంతో తడుముకుంటూనే చెప్పాడు బాబా భాస్కర్‌ మాస్టర్‌. మధ్య మధ్యలో కొన్ని అక్షరాలు వదిలేశాడు. దీంతో బిగ్‌ బాస్‌ హౌస్‌లో సభ్యుల వద్ద ఇంగ్లీష్‌ అక్షరాలు నేర్చుకోవాల్సిందిగా బాబా మాస్టర్‌కి టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఈ విషయం బిగ్‌ బాస్‌ హౌస్‌లో సభ్యులకు చెప్పాడు. అయితే, అతడు చెప్పింది నిజమేనని చాలా మంది నమ్మారు.దీనితో బాబా భాస్కర్‌ ఈ టాస్క్‌లో గెలిచినట్టయినప్పటికి నవ్వుల వర్షం కురిసింది.

Related posts

19న‌ హరితోత్స‌వంలో పాల్గొన‌నున్న సీయం కేసీఆర్

Satyam NEWS

ఆత్మనిర్భర్ భారత్ తో పురోగమిస్తున్న నావికాదళం

Satyam NEWS

డేంజర్ బెల్స్: వందకు డయల్ చేస్తే వచ్చి నిన్నే కొడ్తా

Satyam NEWS

Leave a Comment