భారత్‌లో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ దాడులు తెగబడవాచ్చని ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబీ) వెల్లడించింది. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా వారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ తెలిపింది.ఢిల్లీ, గుజరాత్‌లలో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పదేఅవకాశముందని ఐబీ అంచనా వేస్తోంది.
నేపాల్ నుంచి ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారని దీంతో ఇరు రాష్ర్టాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలపై పోలీసులు నిఘా ఉంచాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఇంటిలిజెన్స్ బ్యూరో అన్ని రాడ్ట్రాల పోలీసులను సూచించింది.