33.7 C
Hyderabad
April 29, 2024 01: 22 AM
Slider వరంగల్

కార్మిక గర్జన పాదయాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటు

#citumahaboobabad

కార్మిక హక్కుల కోసం నిర్వహించే పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనాల జీవోలను జారీ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిఐటియు నిర్వహిస్తున్న కార్మిక గర్జన పాదయాత్రను రంగారెడ్డి జిల్లాలో అడ్డుకొని, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించడం టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిరసనగా తొర్రూరు పట్టణ కేంద్రంలో గాంధీ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జమ్మల శ్రీను మాట్లాడుతూ ఈనెల 8న కార్మికుల హక్కుల రక్షణకై, కనీస వేతనాల సాధనకై పోలీసులు అనుమతితో ప్రారంభమైన పాదయాత్ర  మూడు రోజులుగా శాంతియుతంగా జరిగిందని తెలిపారు. పాదయాత్ర ద్వారా కార్మికుల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి పర్యటన సాకుతో పాటు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి రంగారెడ్డి జిల్లాలో ఆదిభట్ల ప్రాంతంలో పోలీసులతో అరెస్టు చేయించారని, ఇది బిజెపి టిఆర్ఎస్ ల కుమ్ముక్కు తనాన్ని తెలయజేస్తుందని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ నేతలు పాదయాత్ర ఆశీర్వాద యాత్రలు చేయవచ్చు కాని కార్మికుల న్యాయమైన హక్కులకోసం సిఐటియు పాదయాత్ర చేయకూడదా అని వారు ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్, నిరంకుశ చర్యలను ప్రజలందరూ ఖండించాలని కోరారు. తక్షణమే అరెస్ట్ చేసిన పాదయాత్ర బృందం నేతలను విడుదల చేయాలని లేనియెడల కార్మికుల తీవ్ర ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు బొల్లం అశోక్, ఎండి యాకుబ్, డోనక దర్గయ్య , ప్రస్తుతం భాస్కర్, మాలోత్ సురేష్ బాబు, జిగిజర్ల శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Related posts

పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించాలి

Satyam NEWS

రివర్స్ హ్యాండ్: తిరగబడిన కాంగ్రెస్ చరిత్ర

Satyam NEWS

పార్టీలకు అతీతంగా ’సర్ధార్‌ సర్వాయిపాపన్న సేన’ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment