42.2 C
Hyderabad
May 3, 2024 17: 47 PM
Slider సంపాదకీయం

సీక్రెట్: కడప టిడిపి నేతకు తెలంగాణ హస్తానికి లింకు?

income tax

కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడిలో అత్యంత కీలకమైన పత్రాలు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కడప అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. ఆయన తమ్ముడు రమేష్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తరపున రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

వీరిద్దరూ కూడా మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడి కుమారుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులు. కడపలోని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈ నెల 6న సుమారు 10 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడానికి కొద్ది సమయం ముందే స్థానిక పోలీసులకు కూడా తెలియకుండా సిఆర్ పిఎఫ్ పోలీసులు వచ్చి శ్రీనివాసరెడ్డి ఇంటికి భద్రతగా నిలిచారు.

ఇంత పకడ్బందిగా జరిగిన ఆపరేషన్ లో అత్యంత కీలక పత్రాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికినట్లు తెలిసింది. ఆ కీలక పత్రాలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు డబ్బులు పంపిన ఆధారాలు దొరికినట్లుగా అనధికారికంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల పొత్తుతో పోటీ చేసిన విషయం తెలిసిందే.

కొందరు అభ్యర్ధులకు నేరుగా పంపించగా మరి కొందరు అభ్యర్ధులకు హైదరాబాద్ పంజాగుట్టలోని తమ కార్యాలయం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పంపినట్లుగా రుజువులు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పంజాగుట్టలో శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి కి సంబంధించిన కంపెనీలు తెలంగాణ, మహారాష్ట్ర లలో పలు ఇన్ ఫ్రా ప్రాజెక్టులు చేస్తున్నారు.

పెద్ద ఎత్తున లావాదేవీలు చేసే ఈ కంపెనీల నుంచి నిధులు వివిధ సంస్థలకు, వ్యక్తులకు బదిలీ అయినట్లు ఐటి అధికారులు కనుగొన్నారని తెలిసింది. ఎన్నికల ఫండ్స్ ను శ్రీనివాసరెడ్డి కంపెనీల నుంచి రహస్యంగా అందుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  ఎన్నికల సమయంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని నడిపిన ఈ ఇద్దరు ప్రముఖలకు శ్రీనివాసరెడ్డి కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు అందినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆధారాలు దొరికాయి. ఈ నిధులకు చంద్రబాబు, లోకేష్ లకు, తెలంగాణకు చెందిన ఇద్దరు టాప్ కాంగ్రెస్ నాయకులకు లింకు ఉన్నట్లు తేలితే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతాయి.

Related posts

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

Bhavani

ఆటోవాలాలకు మున్సిపల్ చైర్మన్ ఆర్ధిక సాయం

Satyam NEWS

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: పూరి

Satyam NEWS

Leave a Comment