33.7 C
Hyderabad
April 29, 2024 02: 36 AM
Slider విజయనగరం

సమయ పాలన పాటించాలి, పని చేసే చోటే నివాసం ఉండాలి

#ITDA Project officer

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించే నిమిత్తం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని వినూత్నమైన  మార్పులు తీసుకువచ్చిందని రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా లో  ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ అధికారి తన పర్యటనలో భాగంగా పార్వతీపురం  మునిసిపాలిటీ పరిధిలో గల బెలగం సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు.

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని సమయ పాలన పాటించాలని అన్నారు. 

పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక పరిశీలించారు. వాలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించు కోవాలని హితవు పలికారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి పార్వతీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు.

వై.టి.సి లో నిర్వహిస్తున్న మహిళా కుట్టు మిషను శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి శిక్షణ పై ఆరా తీశారు, శిక్షణ పొందుచున్న కొందరు మహిళలు కుట్టుమిషినే లు సరిగా పనిచేయడం లేదన్నారు.

వెంటనే వాటిని బాగుచేయించాలని సంబంధిత సిబ్బందికి సూచిస్తూ మంచి మెలుకువలతో కూడిన శిక్షణ అందించాలని శిక్షణ వారి జీవనోపాధికి పూర్తిగా ఉపయోగపడేలా ఉండాలని హితవు పలికారు. అనంతరం ఉద్యానవన శాఖ గోడౌన్ పరిశీలించారు అందులో వున్న ఫుట్ స్ప్రయేర్లు లబ్ధిదారులకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని పి.హెచ్. ఓ చిట్టి బాబుకు సూచించారు, పర్యటనలో వై.టి.సి మేనేజర్ గంట సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగులో తప్పు మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తున్నారు

Satyam NEWS

అమ్మ భాష కమ్మదనం

Satyam NEWS

క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment