40.2 C
Hyderabad
April 29, 2024 15: 14 PM
Slider మహబూబ్ నగర్

విద్యుత్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన జేఏసీ

#ElecricityEmployees

శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేడు ఉద్యోగులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు తో సహా అన్ని స్థాయిల ఇంజనీర్లు, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ఆగ్ని ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్లు ఉన్నాయి. ఒకోక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు మొత్తం రన్నింగ్ లో ఉన్నాయి.

ప్రమాదవశాత్తూ మొదటిగా నాలుగో యూనిట్ ప్యానల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ అయి భారీగా మంటలు చలరేగాయి పవర్ హౌస్ మొత్తం పొగతో నిండుకు పోవటంతో డ్యూటిలో ఉన్న ఇంజనీర్లు కిందిస్దాయి సిబ్బంది భయాందోళనలకు గురై లోపల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఉరుకులు తీశారు.

అందులో 9 మంది చనిపోయారు. వారి ఆత్మ శాంతికి SLBHES సిబ్బంది మౌనం పాటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని మూడు రోజుల సంతాపదినాల కార్యక్రమాలలో భాగంగా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర మౌనం పాటించారు.

Related posts

కరోనా ఎలర్ట్: విజయవాడలో మరింత అప్రమత్తం

Satyam NEWS

కంటి వెలుగు కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

గుడ్ డెసిషన్: మమ్మల్ని గుర్తించే పార్టీనే మేం గుర్తిస్తాం

Satyam NEWS

Leave a Comment