26.7 C
Hyderabad
April 27, 2024 09: 21 AM
Slider ఖమ్మం

కేంద్రానికి అబద్దాలు చెబుతూ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న జగన్

#Puvvada

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో రాజీ పడేదే లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్ ద్వారా నీటి చౌర్యం చేస్తుందని ధ్వజం ఎత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్జీటీ తీర్పులను ఏపీ గౌరవించడం లేదని ఆరోపించారు. వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలని తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని, కేంద్రానికి అబద్ధాలు చెప్తూ అక్రమంగా ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి విమర్శించారు.

ఏపీ నీటి చౌర్యాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, కేంద్రంతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని అన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని, వైఎస్‌ దొంగ అయితే.. జగన్‌ గజదొంగ అనే వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారని, జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ఇంటికి ఆహ్వానించారని గుర్తు చేశారు.

బేసిన్లు, భేషజాలకు పోకుండా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేద్దామని కేసీఆర్‌ ప్రతిపాదించారని, గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించుకుందామని అన్నారని మంత్రి పువ్వాడ గుర్తుచేశారు. వైఎస్‌ హయాంలో తెలంగాణలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాకి ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా? అని ప్రశ్నించారు.

ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టును నిర్మించి రెండు, మూడు పంటలకు నీటికి సమకూర్చుకుంటున్నామని అన్నారు.

కొట్లాట పెట్టడం సరికాదు..

కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారన్నారు. ఏపీ సర్కారు ఏకపక్షంగా ముందుకెళ్తోందన్నారు. కేంద్రం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు.

ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదని, కృష్ణా అవతల ఉన్నాం.. కట్టుకుంటామంటే కుదరదని  వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల ద్వారా దేశ సంపద పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య కొట్లాట పెట్టించడం సరికాదన్నారు. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ఎందుకు పాటించట్లేదని ప్రశ్నించారు.

కారేపల్లి లో 100 పడకల ఆసుపత్రి కావాలి

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినతి సమర్పించారు. ఎమ్మెల్యే రాములు నాయక్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

వాళ్ళిద్దరు కలిశారంటే జగన్ పార్టీ పని అవుట్

Satyam NEWS

అదిలాబాద్ జిల్లాలో గుట్కా రాకెట్ ను ఛేదించిన పోలీసులు

Satyam NEWS

జన హృదయ విశ్వ విజేత జనం మెచ్చిన మహా నేత

Satyam NEWS

Leave a Comment