38.2 C
Hyderabad
April 29, 2024 19: 02 PM
Slider తూర్పుగోదావరి

జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ కు హానికరం

#pawan

జనసేన ను అధికారంలోకి తీసుకురావాలని కోరడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉంటారో మీరే నిర్ణయించుకోండి. మార్పు రావాలంటే గోదావరి జిల్లాల నుండి మొదలవుతుంది. ముద్దుల మామయ్యను మళ్ళీ ఆదరిస్తారా? అనేది మీరే ఆలోచించుకోండి. జగన్ పాలన మాత్రం రాష్ట్రానికి హానికరం అని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికలకు జనసేన సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

ఎన్నికల సమయములో జనసేన ప్రణాళిక వెల్లడిస్తా. ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయం.  మరో సారి వై‌సి‌పి అధికరంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారం.  ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు వై‌సి‌పి హానికరం. వంద తప్పులను సహిస్తాము, భరిస్తాము. తర్వాత తాట తీస్తాము.  వై‌సి‌పి లేని రాష్ట్రాన్ని చూడబోతున్నాము అని ఆయన అన్నారు.

మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ ఆధ్వర్యంలో శనివారం కౌలు రైతుల భరోసా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, కొణిదెల నాగేంద్రబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గోన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కౌలు రైతు  కుటుంబాలకు  ఇప్పటికే కోట్ల రూపాయలు సాయం చేశాము. 

ప్రభుత్వంలో లేకపోయినా కౌలు రైతులకు సాయం చేస్తున్నాము. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఎన్నికల ముందు అమ్మ, అక్క అంటూ ముద్దులు పెట్టారు.   ముద్దుల మామయ్యలాగా అంబేడ్కర్ పాదయాత్ర చేయలేదు.  నా ఊపిరి ఉన్నంతవరకు జనసేన విలీనం చేయం.  

రాష్ట్ర  భవిష్యత్  నిర్ణయించే శక్తి గోదావరి ప్రజలకు ఉంది. ఉమ్మడి  తూ.గో. జిల్లా లో రాజకీయ చైతన్యం ఎక్కువ.  గోదావరి జిల్లాలో మార్పు మొదలైతే పులివెందులకు వరకు వెళ్తుంది. ఏ వ్యక్తి అయినా రాజ్యాంగ బద్ధుడై ఉండాలి. తెలంగాణా లో నా అనే తెలంగాణ భావన ఉంది.  కులమనే భావన ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. కులాన్ని గౌరవిస్తూ కులానికి అతీతంగా ఉండాలి.  అంబేడ్కర్ నాకు ఆదర్శం.  ఎం‌ఎల్‌సి అనంతబాబు కేసును మభ్య పెట్టేందుకే కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టారు. కోనసీమకు అంబేడ్కర్ పేరుపెడితే మొదట మేమే స్వాగతించాము. 

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పంచాయతీలకు వై‌సి‌పి ప్రభుత్వం నిధులు ఇచ్చిందా.  జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాలకే. నిండు గర్భిణీ అంగన్వాడీ కేంద్రాల వద్ద నిలుచునే పరిస్తితి రావాలా? ప్రభుత్వం  చేసే తప్పులను ప్రజలు ప్రశ్నించాలి. తప్పులను ఎత్తి చూపే బాధ్యత యువత తీసుకోవాలి, ధైర్యం లేకుంటే అరాచకమే రాజ్యం ఎలుతుంది.  నాయకులను నిలదీసే యువత మనకు రావాలి.  పోలీసులు కూడా వ్యవస్థ ప్రకారం పనిచేయాలి.  పోలీసుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి.  ఎంతమందిని అరెస్టు చేస్తారు. జైలులో పెడుతారు.  కేసులకు భయపడవద్దు. జనసేన అండగా  ఉంటుంది. జనవాణి పెట్టగాని వై‌సి‌పి నేతలకు మెళుకువ వచ్చింది

పాఠశాలలు విలీనం చేసి దూరం వెళ్లమంటే  ఎలా?  చిన్నపిల్లలు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లగలరా? అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగు చేస్తాము. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాము. ఏపిఅభివృద్దే జనసేన ధ్యాయం.  తెలుగు ప్రజల ఐక్యత కోరుకుంటున్నాము. గోదావరి వరదబాధితులకు సాయం చేయాలని జనసేన పిలుపునిచ్చారు.

Related posts

ప్రోబ్లెమ్స్:ట్రాన్స్ కో సార్లు జరా సెట్ చేయుండ్రి

Satyam NEWS

బిసి చైతన్య సభను జయప్రదం చేయండి

Satyam NEWS

500 కుటుంబాలకు సాయం అందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment