40.2 C
Hyderabad
April 28, 2024 16: 16 PM
Slider కడప

జగన్ కుట్రలు చేదిస్తాం .. కుతంత్రాల వైకాపా ను తరిమేస్తాం

#TDP

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక వైకాపా ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన ముఖ్యమంత్రి కుట్రలను చేదిస్తాం అలాగే వివిధ ప్రాంతాల్లో వైకాపా నాయకులు చేస్తున్న కుతంత్రాలను తరిమేస్తామని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాజంపేటలో బత్యాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా గురువారం నాడు 16వ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షలకు ఆయన రాజంపేట పట్టణంలోని మరియు సిద్ధవటం, సుండుపల్లి, నందలూరు మండలాల నుండి టిడిపి శ్రేణులతో కలిసి హాజరై సంఘీభావం తెలిపారు.

జనసేన పార్టీ నాయకులు పార్లమెంట్ సమన్వయకర్త రామా శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు హాజరై రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో వేల అక్రమ కేసుల్లో మా నాయకుడిని ఇరికించి మరోసారి అధికారంలోకి రావాలనుకోవడం సీఎం జగన్ కు కలగానే మిగులుతుందని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైకాపా అవినీతి అక్రమాలపై ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పి తరిమి తరిమి కొట్టి ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఇది వైకాపా నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలని తెలిపారు. అమరావతి రింగ్ రోడ్డు విషయానికొస్తే అక్కడ రోడ్డు వేయలేదని ప్రతిపాదనలకే పరిమితమయ్యాయని ఆ ప్రతిపాదనలో కూడా అక్రమంగా లోకేష్ బాబుపై 14 ముద్దాయిగా ఇరికించి కేసు నమోదు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

మా ప్రాంతంలో కూడా నేను రోడ్డు వేస్తానంటే కొంతమంది అడ్డు తగలారని అయినప్పటికీ నేను ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో రోడ్డు వేశానని ఆ తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఆరు నెలలు తనతో మాట్లాడలేదని తెలిపారు. ఆరు నెలల తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందినా వెంటనే ఆ ప్రాంతవాసులు వారే స్వయంగా తనను ఆహ్వానించి ఆరు పొట్టేలు కోసి తనకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అభినందించారని తెలిపారు.

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముందుగా అక్కడ రోడ్లు వేయాల్సి వస్తుందని తెలిపారు. అందులో భాగంగానే అమరావతి అభివృద్ధి లో భాగంగా రింగ్ రోడ్డుకు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లో ప్రతిపాదనలుj పంపారని తెలిపారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో భారీ ఓట్ల మెజారిటీతో విజయవంతంగా గెలుపొంది, ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకుంటారని తెలిపారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావాలని కేసు నుంచి ఆయన త్వరగా బయటపడాలని మీలాద్-ఉన్-నభీ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా త్వరలో ఆయన బయటికి వచ్చే సమయానికి రాజంపేట నియోజకవర్గంలో పదివేల మందితో భారీ ర్యాలీ చేపడతామని తెలిపారు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎంతమందిని అరెస్టు చేసిన భయపడే ప్రసక్తే లేదని ర్యాలీని మాత్రం ఖచ్చితంగా నిర్వహిస్తామని ఇందుకు నియోజకవర్గంలోని టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై ఏ రోజు ర్యాలీ చేయాలో అన్న విషయంపై చర్చిస్తామని వివరించారు.

ఇక జగన్ రెడ్డి విషయానికొస్తే ఈ నాలుగున్నర సంవత్సర పాలనలో 85 స్కాములు చేశారని ఈ 85 స్కాముల్లో తప్పకుండా శిక్ష పడుతుంది అని మా లెక్క ప్రకారం ఒక్కొక్క కేసుకు మూడు ఏళ్ల జైలు శిక్ష వేసినా 260 సంవత్సరాలు ఈ 85 కేసుల్లో సీఎంకు శిక్ష పడుతుందని ఆయన శేష జీవిత కాలమంతా జైల్లోనే గడపాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గం లోని సిద్ధవటం, నందలూరు, టి.సుండుపల్లి, రాజంపేట అర్బన్,రూరల్ మండలాల నుండి పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు.

Related posts

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

Satyam NEWS

ఈద్గా, ఖబరస్తాన్ పనులను పరిశీలించిన ముస్లిం మైనార్టీ నాయకులు

Satyam NEWS

28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

Satyam NEWS

Leave a Comment