రోడ్డు ప్రమాదంలో మామ మృతి చెందగా కోడలికి తీవ్ర గాయాలైన సంఘటన బుగ్గారం మండలం వెల్గొండ అడ్డరోడ్డు వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది.స్థానిక ఎస్‌ఐ చిరంజీవి స్థానికుల సమాచారం మేరకు మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ముదురుకోల నర్సయ్య(45) ధర్మపురి మండలంలోని నేరెల్లకు తన కోడలు వనిత ఇంటికి వచ్చాడు.
కోడలును తీసుకుని ద్విచక్రవాహనంపై మల్లాపూర్ వెళ్తుండగా వెల్గొండ అడ్డరోడ్డు వద్ద బస్టాండ్‌కు దగ్గర జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బస్సును ఆపడంతో నర్సయ్య బస్సు వెనుక బాగంలో ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కోడలు వనిత ముఖానికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే నర్సయ్య మృతి చెందాడంటూ బంధువులు రోడ్డు మీద బైఠాయించేందుకు ప్రయిత్నించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ లక్ష్మీబాబు, ధర్మపురి ఎస్సై శ్రీకాంత్ నర్సయ్య బంధువులకు సర్ది చెప్పారు. కోడలు వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ను