28.7 C
Hyderabad
April 26, 2024 09: 25 AM
Slider మెదక్

దరువు అంజన్నకు జానపద కళానిది బిరుదు ప్రదానం

#daruvuanjanna

పాటనే ఆయుధంగా మలిచి కత్తుల వంతెన మీద ప్రయాణం సాగిస్తున్న ఉద్యమ కెరటం మన దరువు అంజన్న. మారుమూల ప్రాంతమైన సిద్దిపేట జిల్లా రాయపోల్లో గ్రామం లో జన్మించి తన పాటలను ఖండాంతరాలు దాటించిన ఘనత అంజన్నది.  మలిదశ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరు సల్పి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అంటూ ఊరురా వాడ వాడ తెలంగాణ నినాదాన్ని వినిపించాడు. తుపాకీ గుళ్లను సైతం లెక్కచేయకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ  జేఏసీ చైర్మన్ గా ఎన్నో సేవలు అందించాడు. అంజన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివిధ అవార్డులు ఇచ్చి సత్కరించింది. రాయపోలు గ్రామంలో మాస్టర్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 45 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమంలో దరువు అంజన్నను ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాస్టర్ జి ఘనంగా సత్కరించి  “జానపద కళానిది ” అనే బిరుదును అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్, ప్రజాహితా ఫౌండేషన్ చైర్మన్ మామిడి మోహన్ రెడ్డి రాయపోల్ కృష్ణారెడ్డి, జిల్లా బిజెపి నాయకులు బాగన్న గారి రవీందర్ రెడ్డి అందె ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ అందే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో 14 నామినేషన్లు ఆమోదం

Satyam NEWS

గోళ్ళ పాడు ఛానల్ పరిశీలన

Murali Krishna

బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో చండీహోమం

Satyam NEWS

Leave a Comment