29.7 C
Hyderabad
May 2, 2024 05: 16 AM
Slider చిత్తూరు

తిరుపతి భూ ఆక్రమణలపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

#KiranRayal

పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుపతిలో భూ మాఫియా పెట్రేగిపోతున్నదని తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఒక లేఖ రాశారు.

తిరుపతిలో భూ కబ్జాదారులు ఎక్కువైపోయారని, తిరుపతిలో ఖాళీ స్థలాల్లో అలాగే ఇండస్ట్రీ ల్యాండ్, అపార్టుమెంట్ లు ఫ్లాట్స్ లలో ఆక్రమణలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. మధ్యతరగతి కుటుంబాలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులపై దాడులు ఎక్కువైపోతున్నాయని ఆయన తెలిపారు.

దీనిపై పోలీస్ కంప్లైంట్ చేసిన కూడా ఎటువంటి వంటి యాక్షన్ తీసుకోవడం లేదని అందువల్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. తిరుపతి చాలా ప్రశాంతమైన వాతావరణం అని ఆయన అన్నారు.

అయితే కొద్ది రోజులుగా తిరుపతిలో పరిస్థితి మొత్తం మారిపోయింది ఎక్కడ చూసినా భూకబ్జాలు ఎవరితో మాట్లాడినా మా ఆస్తులు కాజేశారు మా స్థలానికి రక్షణ  లేదని చెప్పి బాధ పడుతున్నారని ఆయన అన్నారు.

ఉదాహరణకు తిరుపతి రేణిగుంట రోడ్డు బాలాజీ టింబర్ డిపో జరిగిన సంఘటన అలాగే తిరుపతి అర్బన్ లో కొంకాచెన్నయ్ గుంట వద్ద 30 అంకణాల స్థలం కూడా కడప కు సంబంధించిన కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించారని ఆయన తెలిపారు.

దీని పైన సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారి మీదే క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్ట్ చేస్తాం అని భాదితులనే  భయపెట్టారని అన్నారు. ఇలాగే తిరుపతి రూరల్ లో కూడా చాలా వరకూ సమస్యలు ఎదురవుతున్నాయని అందువల్ల భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి తిరుపతి ప్రజలకు రక్షణ కల్పించాలని అలాగే వారి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని కిరణ్ రాయల్ అన్నారు.

Related posts

బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

విశాఖ తెలుగుదేశం నాయకుడి ఆస్తులు నేలమట్టం

Satyam NEWS

రుజువులు ఎక్కడ తేను

Satyam NEWS

Leave a Comment