31.7 C
Hyderabad
May 2, 2024 08: 49 AM
Slider విజయనగరం

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గేంచేంతవరకు జనసేన పోరాటం ఆపదు

జనసేన అధినేత పిలుపు మేరకు, పెంచిన విధ్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి,కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు.అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ కు జనసేన పార్టీ విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి వినతిపత్రాన్ని సంపర్పించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల ముందు అధికారపక్షం చేస్తున్న తప్పులను ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువగా ప్రజలపై భారాన్ని మోపుతున్నారని, గతంలో ఆర్.టి.సి చార్జీలు బాదుడే బాదుడు అన్నారు.

అంతకన్నా ఎక్కువ ఛార్జీలతో మరింత భాదారు. ఇలా ప్రజలు నిత్యం ఉపయోగించే అన్నిటిపైన రేట్ల భారాన్ని వేసి ప్రజల నడ్డి విరగ్గొట్టారు. ఈ కోవలోనే ఇప్పుడు కరెంటు చార్జీలు అత్యధికంగా పెంచేశారు. గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని చెప్పి ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా చార్జీలు పెంచడం ప్రజల్ని మరోమారు మోసం చెయ్యడమే అవుతుందని ప్రభుత్వంఫై దుయ్యబట్టా రు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ అధినేత పిలుపు మేరకు అన్ని జిల్లాల కలక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద జనసేన ప్రధాన కార్యదర్శి యశశ్వని ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు జనసేన అనేక మార్గాలలో తన నిరసన తెలియజేస్తుందని ప్రభుత్వం దిగివచ్చి పెంచిన కరంట్ చార్జీలు తగ్గించినంత వరకు జనసేన పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చిరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళ విభాగం,ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మిలక్ష్మి రాజ్, గాయిత్రి, జనసేన పార్టీ సీనియర్ నేతలు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు,ఇంచార్జ్ గిరడ అప్పలస్వామీ,గంగా ధర్, పతివాడ అచ్చుమ్ నాయుడు, బూర్లి విజయ్ శంకర్, దిండి రామారావు, వబ్బిన సత్తిబాబు,గొరపల్లి రవికుమార్,సుంకర అప్పారావు, దంతులూరి రామచంద్ర రాజు,బోడసింగి రామకృష్ణ, సిగ తవిటినాయుడు , మర్రాపు సురేష్,గెద్ద రవి తదితరులు భారీగా జనసైనికులు హాజరుయ్యారు.

Related posts

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పకడ్బందిగా చేస్తున్న అధికారిపై బదిలీవేటు

Bhavani

త్వరలో ప్రాంతీయ పార్టీల నెత్తిన పడబోతున్నది పిడుగు

Satyam NEWS

ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన నీలం

Satyam NEWS

Leave a Comment