22.7 C
Hyderabad
July 15, 2024 01: 32 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన నీలం

neelam

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, ఎంపవర్ మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఏపికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలక్టర్ గా పనిచేశారు. అలాగే టెక్కలి సబ్ కలక్టర్ గాను, నల్గొండ జిల్లా కలెక్టర్ గాను పని చేశారు. అదే విధంగా మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. అలాగే నిజామాబాదు జిల్లా పిడిడిఆర్డిఏ గాను, ఖమ్మం జిల్లాల్లో కాడా(CADA)అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు. తదుపరి ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ గా, టిఆర్అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు. అదే విధంగా క్రీడల శాఖ కమీషనర్, సాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా విభజన తర్వాత తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం బాధ్యతలు స్వీకరించారు.

Related posts

కూరగాయల మార్కెట్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

నిర్నీత గడువులోగా లే అవుట్లకు అనుమతులు

Bhavani

Nalgonda Police: ఆపరేషన్ స్మైల్ – 7 విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment