38.2 C
Hyderabad
April 29, 2024 20: 38 PM
Slider కడప

జీవి ఫుట్ బాల్ కుంభకోణం పై విచారించాలి

#CPI 5

జీవి ఫుట్ బాల్ యాప్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ కొంతమంది ఏజెంట్లు ప్రచారం చేసిదాదాపూ 50కోట్లు పెట్టుబడులు పెట్టించుకుని కోణానికి పాల్పడ్డారని ఈ కుంభకోణంపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ) కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు మంగళవారం సిపిఐ

కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదన్నారు ఇటీవల కాలంలో జీవి ఫుట్బాల్ యాప్ లో పెట్టుబడులు పెడితే నూటికి నూరు శాతం లాభాలు వస్తాయని జీవి ఫుట్బాల్ యాజమాన్యం కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని కడప నగరంలో కొన్ని ఫంక్షన్ హాల్ లో సమావేశం అయ్యి ఆ సమావేశంలో ఏజెంట్లుగా నియమించుకొని ఉద్యోగులకు, వ్యాపారులకు రెట్టింపు స్థాయిలో లాభాలు వస్తాయన్న ఆశ రేకెత్తించే వారి ద్వారా దాదాపు 50 కోట్ల

రూపాయలు పెట్టుబడులు పెట్టించుకుని మోసం చేశారన్నారు పోయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు చిరు వ్యాపారులు యువత అన్ని వర్గాల వారు కూడా ఉన్నారని ఎక్కువ లాభాలు అర్దించొచ్చు అన్న ఆశతో చాలామంది అప్పు చేసి కూడా పెట్టుబడులు పెట్టారని అయితే తీరా జివి ఫుట్బాల్ యజమాన్యం మోసానికి పాల్పడిందని ఈ యాజమాన్యంపై సైబర్

క్రైమ్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి యాజమాన్యం పైన ఏజెంట్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు జీవి ఫుట్బాల్ బాధితులు వారు పెట్టిన పెట్టుబడులు వారకి తిరిగి ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి వలరాజు ఏఐవైఎఫ్ నగర సమన్వయకర్త ఎస్.కె మైనద్దీన్ లు పాల్గొన్నారు

Related posts

తిరుమల-మెడికోవర్ సహాయంతో పోలీసులకు ఉచిత వైద్య పరీక్ష

Satyam NEWS

రేప్:27ఏళ్ల మహిళపై మృగాడి అత్యాచారం

Satyam NEWS

ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టి‌ఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

Leave a Comment