40.2 C
Hyderabad
April 29, 2024 15: 19 PM
Slider ఆదిలాబాద్

కార్మికుడి జీవితంతో JK పేపర్ మిల్లు యాజమాన్యం చెలగాటం

#BJPSirpur

విధి నిర్వహణలో మరణించిన కార్మికుడికి సిర్పూర్ కాగజ్ నగర్ JK పేపర్ మిల్లు యాజమాన్యం న్యాయం చేయకపోగా కేసు మాఫీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కొమురం భీం జిల్లా బీజేపీ అధ్యక్షుడు J B పౌడెల్ ఆరోపించారు.

 కాగజ్ నగర్ పట్టణ బీజేపీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిర్పూర్ కాగజ్ నగర్ JK పేపర్ మిల్లు లో పని చేసే కాంట్రాక్ట్ కార్మికుడు D విజయ్ కుమార్ నిన్న కంపెనీలో ఎలక్ట్రిక్ కార్యాలయం విధులు నిర్వహిస్తుండగా మరణించాడని ఆయన తెలిపారు.

తక్షణమే విజయ్ కుమార్ ను ఇఎస్ఐ ఆస్పత్రికి తరలించారని అయితే మృతదేహాన్ని అక్కడ నుంచి యాజమాన్యం బలవంతంగా సిర్పూర్ టి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారని ఆయన అన్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని యాజమాన్యం అణచి వేస్తున్నదని ఫౌడెల్ అన్నారు.

పోలీసుల సహాయంతో పేపర్ మిల్ యాజమాన్యం దౌర్జన్యంగా కార్మికుడి కుటుంబసభ్యులను బెదిరించిందని ఆయన తెలిపారు. కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన కార్మిక సంఘాలు నాయకులని, ఇతర పార్టీల నాయకులని గృహానిర్బంధం చేసి మరికొంతమందిని అక్రమ అరెస్టులు చేసారని ఆయన తెలిపారు.

ఆ కార్మికుడి కుటుంబానికి తగిన న్యాయం జరిగేవరకు BJP పార్టీ తరపున పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా. కొత్తపల్లి శ్రీనివాస్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఠాకూర్ విజయ్ సింగ్ మాజ్ధుర్ సెల్ జిల్లా కన్వీనర్ శరద్ శర్మ సిర్పూర్ తాలూకా కన్వీనర్ వీరభద్ర చారి పాల్గొన్నారు.

ఇంకా, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ , జిల్లా కార్యదర్శి దాగామ్ ధీలిప్ , జిల్లా బి.జె.వై.ఎం ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్ ,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి దొంగ్రీ పాల్గొన్నారు.

Related posts

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ పాత్ర ఏమిటి?

Satyam NEWS

శ్రీరామ జన్మభూమి కి సంఘీభావంగా దీపావళి

Satyam NEWS

సిటిజెన్ షిప్ గాడ్:దేవుళ్ళు మైనర్ లే పౌరసత్వం కావాలి

Satyam NEWS

Leave a Comment