స్థానిక అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి హరీష్ రావు అండగా నిలిచారు. లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని లింగం భార్యకి ఔట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు హామీ ఇచ్చారు. టేక్మాల్ మండల రిపోర్టర్ పిండి లింగం అనారోగ్యంతో కొద్దికాలం క్రితం మరణించిన విషయం తెలిసిందే.
లింగం మరణించిన తరువాత కుటుంబం పోషణ గడవడం గగనం అయిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని పిండి లింగం భార్య సంగీత (పూర్ణిమా) ఆశ్రయించగా ఎమ్మెల్యే హరీష్ రావు ని కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా హరీష్ రావు ఉన్నత అధికారులతో మాట్లాడి లింగం భార్యకు టేక్మాల్ మండల జూనియర్ కాలేజ్ లో ఔట్ సోర్సింగ్ జాబ్ కల్పించడంతో పాటు అర్ధాంతరంగా ఆగిపోయిన వారి పిల్లవాడి చదువు గూర్చి తెలుసుకుని కాలేజ్ లో రి-జాయిన్ చేయించారు.