37.2 C
Hyderabad
April 26, 2024 21: 29 PM
Slider ప్రత్యేకం

జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్‌ని ఉపయోగిస్తున్నారా?

#johnsonandjohnson

మీ పిల్లలకు ప్రతిరోజూ జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే ఇది మీకు కష్టం కలిగించే వార్తే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తల్లులు తమ పిల్లల చిన్నతనంలో జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్‌ని ఉపయోగించి ఉంటారు. జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఉత్పత్తులు పిల్లలకు చాలా సురక్షితమైనవిగా ఇంత కాలం పరిగణించారు.

చాలా సంవత్సరాలుగా, భారతీయులు కూడా ఈ కంపెనీ ఉత్పత్తులను చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అవి సహజ పదార్ధాలతో తయారు చేయబడ్డాయి. కానీ ఇప్పుడు, ఈ కంపెనీ (J&J బేబీపౌడర్) ఉత్పత్తి చేసే టాక్ బేస్డ్ బేబీ పౌడర్ వచ్చే ఏడాది మార్కెట్‌లో అందుబాటులో ఉండదు.

జాన్సన్ & జాన్సన్ 2023 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ పౌడర్‌ను విక్రయించడాన్ని నిలిపివేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. 2020 నుండి అమెరికా, కెనడాలో కంపెనీ టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది.

ఈ దేశాలలో కంపెనీపై ఇప్పటివరకు 38,000 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. బేబీ పౌడర్ వాడకం వల్ల చాలా మంది మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ వచ్చిందని ఆరోపణలు వెల్లవెత్తాయి. అమెరికా నిబంధనల ప్రకారం, కంపెనీ విక్రయించే బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నాయని కూడా తేలింది.

అయితే ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. ఈ వివాదాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పౌడర్ ను అమ్మకూడదని కంపెనీ నిర్ణయించింది.

Related posts

చాకిరీ చేయించుకుని బడ్జెట్ లేదని ఎమ్.ఇ.సి.సి లను రోడ్డున పడేస్తారా

Satyam NEWS

పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్‌గా కె.కేశవరావు

Satyam NEWS

కడప నగరంలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

Satyam NEWS

Leave a Comment