38.2 C
Hyderabad
May 3, 2024 19: 32 PM
Slider నిజామాబాద్

సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్

#Bichkunda Journalist

బిచ్కుంద  మండల కేంద్రంలో సర్పంచ్ భర్త నూకలరాజు ఓ దళిత విలేకరిని అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీంతో మండలానికి చెందిన దళిత సంఘాల నాయకులు శనివారం తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపి తహశీల్దార్ వెంకటరావుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్  జిల్లా ప్రచార కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ దళితుడు అయినందువల్లే విలేకరిని అసభ్య పదజాలంతో దూషించాడని దళితుల సహనాన్ని చేతగానితనంగా తీసుకోరాదన్నారు. నూకల రాజును వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన వినతిపత్రంలో కోరారు.

అలా కాని పక్షంలో విడతల వారీగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా విలేకరులు తమ కుటుంబాన్ని వదిలి వార్తలు సేకరించి ప్రపంచానికి తెలియజేస్తున్నారని అటువంటి వారిని దూషించడం ఎంతవరకు సమంజసమన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రవి దేవాడ భీమన్న మేత్రి హనుమాన్లు జీ విట్టల్ బుకవార్ సంజీవ్ జీ విట్టల్ సాయిలు హనుమాన్లు సాయిరామ్ లింగయ్య మారుతి లింగయ్య కిరణ్ హనుమాన్లు సాయిలు, సాయికిరణ్ హనుమాన్లు గుండెకల్లూర్ నాయకులు వెండి గంగాధర్ లాలయ్య   భానుప్రసాద్ పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

నో పాలిటిక్స్: పౌరసత్వంపై ప్రధాని ప్రకటనకు తిరస్కారం

Satyam NEWS

రాజధాని అంటే రాజకీయ కండువా కాదు

Satyam NEWS

ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment