35.2 C
Hyderabad
April 27, 2024 11: 38 AM
Slider గుంటూరు

ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

#mimnarasaraopet

ఒన్ టైమ్ సెటిల్మెంట్ పధకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపహరించుకోవాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట RDO కార్యాలయంలో AO కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కరోనా వలన అనేక ఇబ్బందులు పడి, పనులు లేక పేద ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆయన అన్నారు. మరోపక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటి అర్థకాలి తో అలమటిస్తున్నారని మస్తాన్ వలి తెలిపారు. ఇవేమి పాటించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఒన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయటం అన్యాయం అని తెలిపారు.

గత 50 సంవత్సరాల నుంచి లేని పధకాన్ని ఇప్పుడు ఎందుకు ప్రవేశ పెట్టి పేదలను ఇబ్బంది ఎందుకు పెట్టుతున్నారో అర్ధం కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అని పదే పదే చెప్తున్నా ప్రభుత్వం పెద్దలు సంక్షేమ అంటే ఇదేనా అని ఆవేదన వ్యక్తపరిచారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజల ఇబ్బందులను అర్ధం చేసుకొని వెంటనే ఈ పధకాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ జిల్లా నాయకులు కరీముల్లా, మౌలాలి, బీసీ నాయకులు ఉదయగిరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మిడతల దండు రాకుండా సత్వర చర్యలు

Satyam NEWS

సైబర్ సెక్యూరిటీపై నేడు సాయంత్రం 4గంటలకు లైవ్

Satyam NEWS

స్టూడెంట్స్ కు బ్లూ ఫిల్మ్ చూపించిన టీచర్

Satyam NEWS

Leave a Comment