28.7 C
Hyderabad
April 26, 2024 09: 55 AM
Slider మహబూబ్ నగర్

సమస్యల వలయంలో వనపర్తి కొత్త బస్టాండు

#wanaparthybusstand

వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండును అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 35 సంవత్సరాల క్రితం ఐదు ప్లాట్ ఫారమ్ లతో ఏర్పడ్డ వనపర్తి కొత్త బస్టాండు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతినిత్యం వనపర్తి పట్టణానికి 60 వేల మంది రాకపోకలతో ఎప్పుడూ కిటికీటలాడే కొత్త బస్టాండ్ లో ప్లాట్ ఫారంలు సరిపోక, ప్రజలు ఎండకు వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నారని హైదరాబాదు ప్లాట్ ఫారమ్ ఒక చెట్టు కింద ఉండడంతో, ప్రజలు ఆ చెట్టు కిందనే సేద తిరుతారని తెలిపారు.

మూత్రశాలలు ఒక్కటే ఉండి అది ప్లాట్ ఫామ్ మధ్యనే ఉండి అసౌకర్యంగా ఉందని, ప్రజలందరూ బస్టాండు పరిసర ప్రాంతాలలో మూత్ర విసర్జన చేస్తున్నారని, మూత్రశాలలో నీటి వసతి లేదని చెప్పారు. అలాగే ప్రజలకు తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నారని, ఎమ్మెల్సీ నాగేశ్వర్  ఏర్పాటుచేసిన నీటి శుద్ధి యంత్రం పనిచేయకపోవడంతో, ప్రజలకు నీటి వసతి కల్పించలేకపోతున్నారని అధికారుల నిర్లక్ష్యమేనని చెప్పారు.

కనుక అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష  చొరవ తీసుకుని వనపర్తి బస్టాండ్ లో అత్యవసరంగా ప్లాట్ ఫారమ్ ల సంఖ్య పెంచాలని , మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక, మరియు సీనియర్ సిటిజన్స్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేష్, జనంపేట రాములు, మహమ్మద్ షఫీ, అడ్వకేట్ ఆంజనేయులు, రమేష్ ,సతీష్ పట్టణ సీనియర్ సిటిజన్స్  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

యువ హీరో శ్రీ సింహా ‘భాగ్ సాలే’ చిత్రం ‘కూత రాంప్’ పాట విడుదల

Satyam NEWS

తెలంగాణ రైతాంగంపై బిజెపి దాడి

Satyam NEWS

Leave a Comment