37.2 C
Hyderabad
May 2, 2024 13: 26 PM
Slider మహబూబ్ నగర్

విలేకరుల మధ్య ఐక్యత లేనందునే కేసులు

#NAJA

జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల విలేకరులపై దాడులు జరుగుతున్నాయని నాజా జాతీయ అధ్యక్షుడు  మురహరి బుద్దారం చెప్పారు. ఈ మధ్యకాలంలో జిల్లాలో ఓ ఇసుక మాఫియా అధికారి అండదండలతో జర్నలిస్ట్ పై పాషవికంగా దాడి చేశారని, పక్కనే ఉన్న మరో జర్నలిస్టుపై సైతం దాడి చేయడంతో అతని చెవి కర్ణభేరి సైతం దెబ్బ తిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. అయినా నేటికి చర్యలు శూన్యమని,  ఇదిలా ఉండగా ఆ ఇసుక మాఫియాతో కుమ్మక్కైన ఆ అధికారి దెబ్బలు తిన్న ఆ జర్నలిస్ట్ పైనే తప్పుడు కేసులు నమోదు చేసి శునకానందం పొందుతున్నారని అయన విమర్శించారు. 

నాన్ అక్రెడిటేషన్ జర్నలిస్టులు, అక్రెడిటేషన్ జర్నలిస్టులంటూ జర్నలిస్టుల మధ్యన చిచ్చు పెట్టారన్నారు.  అధికారి కొంత రెచ్చిపోయే ధోరణిని చూపడంతో నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అంతా కలిసి  పిర్యాదు చేశారని చెప్పారు. ఇసుక మాఫియాకు బహిరంగంగా ఇదే మా హెచ్చరిక మీరు చేస్తున్న చట్ట విరుద్ధమైన వ్యవహారాలకు మా జర్నలిస్ట్ లు ఎప్పటికీ తలోగ్గరని తెలిపారు.  జర్నలిస్టు ఎవరైనా జర్నలిస్టే..! అది చిన్న పత్రికనా, పెద్ద పత్రికనా..! పెద్ద మీడియానా చిన్న మీడియానా అనే వ్యత్యాసాలు, తారతమ్యలు మీలో ఉంటాయని, మాలో కాదని గుర్తు చేశారు.  పెద్ద పత్రికైనా, చిన్న పత్రికైనా, రాసే కథనాన్ని బట్టి ఆ జర్నలిస్టుకు ప్రజల్లో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

హేపీ బర్త్ డే: బాలయ్య పేరిట సేవా కార్యక్రమాలు

Satyam NEWS

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఆన్ లైన్ లో అవగాహన కార్యక్రమం

Satyam NEWS

డి రైల్డ్:ఒడిశాలో పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్

Satyam NEWS

Leave a Comment