40.2 C
Hyderabad
April 29, 2024 17: 42 PM
Slider నిజామాబాద్

నిర్లక్షపు కోరల్లో కామారెడ్డి జిల్లా ఆస్పత్రి

#katipalli

ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు వస్తున్నా నిర్లక్ష్యపు కోరల్లో జిల్లా ఆస్పత్రి ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిని బాన్సువాడకు తరలించి ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చారని, జిల్లాకు వైద్య కళాశాల మంజూరైతే జిల్లా ఆస్పత్రిలోనే వైద్యకళాశాలను కూడా అందులోనే ఏర్పాటు చేస్తున్నారన్నారు. పైన వైద్య కళాశాల కోసం నిర్మాణం చేపడితే కింద పెచ్చులూడుతున్నాయన్నారు.

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ పరిస్థితిని వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యక్షంగా చూడాలని కోరారు. హాస్పిటల్ డెవలప్ మెంట్ కమిటీ సమావేశం ఇప్పటి వరకు సమావేశం జరిగిందా… ఆ వివరాలు మీడియాకు చెప్పారా.. అని ప్రశ్నించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మెన్ గా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారని, ఏనాడైనా ఆస్పత్రిని చైర్మన్ సందర్శించారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు కమిటి ఎన్ని సార్లు మీటింగ్ పెట్టారు.. మినిట్స్, డబ్బు ఖర్చులు, ఇతర వివరాలన్ని సూపరింటెండెంట్ మీడియాకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి రోజు 1200 మంది ఒపి ఉంటుందని, డాక్టర్లకు చూడటానికి సరియైన గదులు లేవని, రోగులు ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో  దాదాపు 64 మంది డాక్టర్లు ఉన్నారని, ఉదయం 9 నుంచి 4 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉన్నా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటున్నారన్నారు. గర్భిణీలకు మూత్ర శాల సౌకర్యం లేదని, ఆసుపత్రికి నీటి సౌకర్యం లేదని, ఒక్క బోర్ కూడా పని చేయటం లేదన్నారు. ఆస్పత్రిలో అన్ని ఉచితంగా లభిస్తున్న సులబ్ కాంప్లెక్స్ కట్టి మూత్రంకు వెళ్తే 3 రూపాయలు, మరుగు దొడ్డికి వెళ్తే 10 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాత్రిపూట అత్యవసర పరిస్థితిలో రోగులు ఆస్పత్రికి వస్తె వారిని పైవేటు ఆసుపత్రి పంపి పైవెటు ఆసుపత్రి వద్ద కమిషన్ తీసుకుంటున్నారన్నారు.

ఇప్పుడు కొత్తగా కామారెడ్డిలో ప్రైవెట్ ఆసుపత్రికి అంబులెన్సుల ద్వారా పంపిస్తు కమీషన్ల భాగోతానికి తెర తీసారన్నారు. సిబ్బంది రోజు సంతకాలు పెడతారు కానీ డ్యూటలో ఉండరని, జీతాలు మాత్రం తీసుకుంటారన్నారు.తాను చేసిన ఆరోపణ అబద్దం అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో గల  CC కెమెరాలో సిబ్బంది హాజరు అయిన విషయాన్ని చూపించాలని సవాల్ చేశారు. రోగులకు ఇచ్చే భోజనం వంట గది అధ్వాన్నంగా ఉందని, భోజనం కూడా తినే పరిస్థితిలో లేదని, నాణ్యత పూర్తిగా కరువు అయ్యిందన్నారు.

సెక్యూరిటీ సిబ్బంది రాజకీయ నాయకులకు సంబంధించిన వారే ఉన్నారన్నారు.  శానిటేషన్ పూర్తిగా అధ్వాన్నంగా ఉందని, అది కూడా సీనియర్ అసిస్టెంట్  లక్ష్మణ్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రులు లక్ష్మణ్ కనుసన్నల్లో నడవాలసిందేన్నారు. ఆయనకు జిల్లాకు చెందిన బడా నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రిలో పని చేస్తూ ప్రైవేటు ఆసుపత్రి నడిపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి నేరుగా అపెక్స్ ఆసుపత్రి కి రోగులను పంపుతున్న వైద్యుడు అపెక్స్ ఆస్పత్రి ఓనర్ అని, అతను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నవీన్ కుమార్ అని పేర్కొన్నారు.

డాక్టర్ నుండి వార్డు బాయ్ వరకు అందరూ పైవెట్ ఆసుపత్రికి రిఫర్ చేసే వారేనని, అవసరం లేకున్నా స్కాన్ కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్ కి పంపుతూ ఒక్కో స్కానింగ్ మిద కమిషన్ తీసుకుంటున్నారన్నారు. డెలివరీకి వచ్చిన వారిని కారణాలు చెప్తూ కావాలని ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నారన్నారు. ఆస్పత్రిలో సిసి కెమెరాలు కావాలని పని కాకుండా చేస్తున్నారన్నారు. అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా జిల్లా వైద్యాధికారి మారారని, జిల్లాలో మంజూరైన పోస్టులకు డబ్బులు తీసుకుంటూ వాటిని డ్రైవర్, అటెండర్ ఖాతాల్లో జమ చేయిస్తున్నారని, తాను చేసిన ఆరోపణ అబద్ధం అని భావిస్తే సాక్షాలతో సహా కార్యాలయానికి వస్తానన్నారు. జిల్లా ఆస్పత్రిలో రేపటి నుంచి వైద్యుల తీరు మారాలని, సమయపాలన పాటించాలని, తాము నిరంతరం ఆస్పత్రిని పర్యవేక్షిస్తామన్నారు.

Related posts

మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల

Satyam NEWS

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి

Satyam NEWS

అండాండపిండాండ బ్రహ్మాండనాయకుని దేవాలయ ప్రారంభోత్సవం

Satyam NEWS

Leave a Comment