38.2 C
Hyderabad
April 29, 2024 12: 23 PM
Slider ప్రకాశం

జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి

#ongole

జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఎపిడబ్ల్యుజెఎఫ్, ఎపిబిజె ఏ ప్రకాశం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఎపిబిజెఏ) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం మౌన ప్రదర్శన చేపట్టారు. సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించి నిరసనను తెలియజేశారు.

తరువాత సంయుక్త కలెక్టర్(సచివాలయాలు, అభివృద్ధి) టిఎస్ చేతనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్ వి బ్రహ్మం మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న జర్నలిస్టులకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలలో ఎపిడబ్ల్యుజెఎఫు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు రాష్ట్ర స్థాయిలో హై పవర్ కమిటీతో పాటు జిల్లాలో ఎసిపిల సారధ్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

జర్నలిస్టు సంక్షేమ నిధి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమ నిధి కమిటీ ద్వారా అందజేస్తున్న తాత్కాలిక సహాయం నెలనెలా ఇస్తున్న మొత్తాన్ని రూ.1000 నుంచి 5 వేలకు పెంచాలన్నారు.

పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉద్యోగ భద్రతకు వీలుగా ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని మీడియా సంస్థలను తీసుకుంటున్న చర్యలపై తక్షణ నివేదిక తెప్పించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటో కూడా నివేదిక తెప్పించాలన్నారు. మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మౌన ప్రదర్శనలో సీనియర్ జర్నలిస్ట్ వెల్ విషర్ శంకర్, ఎపి బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.కాశీరావు, బి.వెంకట్రావు, ఆంధ్ర ప్రభ బ్యూరో ఇన్‌ఛార్జి ఆర్.శ్రీనివాస నాయక్, మాజీ అధ్యక్షులు ఆర్.రాజశేఖర్, ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా కోశాధికారి ఎల్.రాజు, సీనియర్ జర్నలిస్టులు నూకతోటి శరత్ బాబు, బాలచెన్నయ్య,

పి9 మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, జర్నలిస్టులు సిహెచ్ న రసింహారావు, ఎస్కీ హుస్సేన్, వికోటయ్య, ఎం.శ్రీధర్, కె.సురేష్, ఎస్.సురేష్ కుమార్, ఎం.లక్ష్మయ్య, రామారావు, రమణ, అల్లూరయ్య, దశరధ రాములు, నెమలిగుండం, రమణ, శ్రీను, రమణ, కె.కోటయ్య, ఎం.కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంట్రాక్టర్ వేధింపులతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

అంబర్ పేట్ లో నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Bhavani

అత్యాధునిక వసతులతో 5 ఎకరాలలో కోర్టు భవనం ఏర్పాటు చేస్తా

Satyam NEWS

Leave a Comment