28.7 C
Hyderabad
April 28, 2024 09: 31 AM
Slider నల్గొండ

దశాబ్ది ఉత్సవాలలో జర్నలిస్టులను గుర్తించాలి

#Kandukuri Yadagiri

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేశారని ప్రస్తుతం జరగబోయే దశాబ్ది ఉత్సవాలలో జర్నలిస్టులను గుర్తించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి బుధవారం విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత

ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలలో జర్నలిస్టులను విస్మరిస్తున్నారని ఈసారి నిర్వహించబోయే దశాబ్ది ఉత్సవాలలో నైనా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైనటువంటి జర్నలిస్టులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల సమస్యలను

పరిష్కరించాలని సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలలోనైనా జర్నలిస్టుల సేవలు గుర్తించాలన్నారు. ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగులను కవులను కళాకారులను అందరినీ గుర్తిస్తున్నారు. జర్నలిస్టులను మాత్రమే విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు

Related posts

తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది.

Satyam NEWS

శ్రీవారికి అజ్ఞాత భక్తుల విరాళం 14 కోట్లు

Satyam NEWS

కార్తికేయ నేహా శెట్టి కాంబినేషన్‌లో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సినిమా ప్రారంభం

Satyam NEWS

Leave a Comment