40.2 C
Hyderabad
May 6, 2024 18: 08 PM
Slider వరంగల్

ముఖ్యమంత్రి కెసిఆర్ కు పోస్ట్ కార్డులు పంపిన జర్నలిస్టులు

#Minister KCR

ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిష్కారం అవుతాయి అనుకుంటే ఇప్పటివరకు పట్టించుకోలేదని, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు ఎండి షఫీ, ఉపాధ్యక్షుడు బేతి సతీష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ములుగు కలెక్టరేట్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలి వెళ్లిన జర్నలిస్టులు సీఎంకు డిమాండ్లతో కూడిన ఉత్తరాలను పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన భూమిక కీలకమైందని, ఖ్యమంత్రిగా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అనారోగ్యానికి గురైన జర్నలిస్టులకు చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక మృత్యువాత పడుతున్నారని అన్నారు. వారికి జిహెచ్ఎంసి కింద హెల్త్ కార్డులు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పదేళ్ల పాలనలో హామీలకే పరిమితమై జర్నలిస్టుల కు చేసిందేమీ లేదని, ఇప్పటికైనా అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో కొండం రవీందర్ రెడ్డి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కోశాధికారి బై కాని నటరాజ్, చిన్న పత్రికల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతిరి బిక్షపతి ,సీనియర్ జర్నలిస్టులు కొండి మహిపాల్, రంగిశెట్టి రాజేందర్, తీగల యుగేందర్ , నర్ర రఘువీర్, భూక్య సునీల్ సంపత్ రావు, మాట్ల సంపత్, జాలిగం శ్రీనివాస్, శరత్, హరి .సతీష్ రాజు సృజన్ సుమన్ రామస్వామి . రాజు సుమన్ రమేష్ వెంకన్న ప్రభాకర్. కొమురయ్య ప్రశాంత్ శంకర్ వెంకట్ స్వామి ము లుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

పండుగ రోజు కూడా విధుల్లో పోలీసులు…!

Satyam NEWS

ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Satyam NEWS

అమరావతి కోసం తెలుగుదేశం ఆధ్వర్యంలో పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment