29.7 C
Hyderabad
May 1, 2024 08: 15 AM
Slider మహబూబ్ నగర్

మొక్కలు నాటిన న్యాయమూర్తులు

#World Environment Day

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయమూర్తులు మొక్కలు నాటారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి

శ్రీదేవి జూనియర్ సివిల్ జడ్జి కావ్య మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ చెట్లు ఉంటే క్షేమమని చెట్లే లేకుంటే క్షామమని అన్నారు.ప్రపంచ పర్యావరణ దినం 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి

జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినదని ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము నిర్వహిస్తారని 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం

పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుందని తెలియజేశారు.మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతారణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు

వీటన్నింటిని కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చని తెలిపారు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటి నుండి దొరుకుతాయన్నారు.

అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటామని కాగా ప్రకృతి లోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.ప్రపంచంలోని ప్రతి జీవికి శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. మొక్కలు సూర్యుని శక్తి వలన కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆహారాన్ని తయారు చేసుకుంటాయని భూమిపై నివసించే రకరకాల జీవులు ఒకదానిపై మరొకటి

ఆధారపడి జీవిస్తున్నాయని అన్ని జీవ రాశులకు ప్రధానంగా ఆహారం మొక్కల నుండి అందుతుందన్నారు. అనంతరం జూనియర్ సివిల్ న్యాయమూర్తి కావ్య మాట్లాడుతూ జీవుల మధ్య ఉండే పర్యావరణ సంబంధాల్లో ఇటీవలి కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మన దేశంలో హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో పంట దిగుబడి

పెంచేందుకు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం చాలా ఎక్కువైందని అన్నారు. దీని వల్ల పంట దిగుబడి పెరిగింది కానీ గాలి, నీరు, నేల కలుషితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని పర్యావరణ రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు.

ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ సత్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి న్యాయవాదులు మల్లేష్ శ్రీకాంత్ యాదవ్ లక్ష్మణ రాజు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

షూటింగ్ లో జాతీయ పోటీలకు ఎంపికైన బిసి గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక

Bhavani

ముస్లింలపై వై ఎస్ జగన్ ప్రేమ ఎన్నికల కోసమే

Satyam NEWS

ఖమ్మంకు పాకిన డ్రగ్స్ వ్యవహారం

Bhavani

Leave a Comment