28.7 C
Hyderabad
April 28, 2024 05: 37 AM
Slider క్రీడలు

షూటింగ్ లో జాతీయ పోటీలకు ఎంపికైన బిసి గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక

#Maunika

అవకాశాలు అందిస్తే తమ ప్రతిభను చాటుతాం అంటున్నారు నేటి ఆడపిల్లలు. చదువుతో పాటు అనేక రంగాల్లో రాణిస్తూ దేశ ప్రగతిని నలుదిశలా చాటేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మహాత్మా జ్యోతి బా ఫూలే బిసి గురుకుల విద్యార్థి మౌనిక రైఫిల్ షూటింగ్ లో విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. గత ఆరునెలలుగా శిక్షణ పొందుతున్న మౌనిక వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో జరిగే రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్నే అర్హత సాధించింది.

ఈ సందర్భంగా మౌనికను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్, మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అభినందించారు.

గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులను చదువుతో పాటు అనేక రంగాల్లో ప్రొత్సహిస్తూ వారిలోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా కీసర లోని మహాత్యా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల బాలికల పాఠశాలలో రైఫిల్ షూటింగ్ శిక్షణ ప్రారంభించారు. ఆసక్తి గల విద్యార్థులకు కోచ్ సహాయంతో శిక్షణ ఇస్తున్నారు.

దాదాపు 25మంది బాలికలు శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న మౌనిక విశేష ప్రతిభను కనబరచడంతో ఆమెను గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్ఠాయి పోటీలకు పంపించారు. అక్కడ మంచి ర్యాంక్ సాధించిన మౌనిక సౌత్ జోన్ స్ఠాయి పోటీలకు ఎంపిక కావడంతో గత నెల కేరళలో జరిగిన పోటీలకు పంపించారు. అక్కడ తన ప్రతిభను ప్రదర్శించిన మౌనిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇప్పటికే రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్ని తన ప్రతిభను నిరూపించిన మౌనిక ఈనెల 8న భోపాల్ లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్ని రైఫిల్ షూటింగ్ లో తన గురి తప్పదని మరోసారి నిరూపించింది. జాతీయ స్థాయిలో వచ్చే ఏడాది జరిగే పోటీలకు ఎంపికైంది.

Related posts

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

Bhavani

శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ ఏర్పాట్లు భేష్

Satyam NEWS

కొట్టిందే పోలీసులు… ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి???

Satyam NEWS

Leave a Comment