29.7 C
Hyderabad
May 1, 2024 10: 20 AM
Slider ముఖ్యంశాలు

క్రాస్ రోడ్డ్: కాంప్రమైజ్ అయితే జూపల్లి ఖేల్ ఖతం

jupally krishanrao

అసెంబ్లీ ఎన్నికలలో తనతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కష్టాలు మొదలయ్యాయి. ఓటమి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ పెద్దలతో ఉన్న అనుబంధాలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలైంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో తన రాజకీయ క్రీడతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జూపల్లికి నిద్రలేని రాత్రులు సృష్టిస్తున్నారు. కొల్లాపూర్ టిఆర్ఎస్ మొత్తం బీరం మనుషులతో నిపుంకోవడానికి టిఆర్ ఎస్ అధిష్టానం కూడా అంగీకరిస్తుండటంతో జూపల్లి పరిస్థితి మరింత దిగజారింది. ఈ తరుణంలో వచ్చిన మునిసిపల్ ఎన్నికలను తన రాజకీయ భవిష్యత్తుకు నిచ్చెనలా వాడుకోవాలని చూసిన జూపల్లికి మళ్లీ అడ్డంకి వచ్చిపడింది.

కొల్లాపూర్ నియోజకవర్గం నుండి 1999 కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు గెలిచారు. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ స్థానాన్ని టిఆర్ఎస్ కు ఇవ్వడంతో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై జూపల్లి ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచారు. 2009లో  కాంగ్రెస్ పార్టీ మళ్లీ టిక్కెట్ జూపల్లికే ఇవ్వడంతో ఆయన మల్లీ గెలిచారు. మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర  ఉద్యమ సమయంలో విద్యార్థుల  ప్రాణ త్యాగాలకు చెలించిపోయిన జూపల్లి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమానికి నడుం బిగించారు. 2012లో తాను రాజీనామా చేసిన స్థానం నుంచి టిఆర్ఎస్ తరపున పోటీ చేసి మళ్లీ గెలిచారు. 2014 లో ఇంకో సారి గెలిచి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జూపల్లికి బీరం టిఆర్ఎస్ ప్రవేశంతో కష్టాలు పెరిగాయి. ఒక వైపు ఓటమి మరో వైపు బీరం నుంచి సవాళ్లు ఆయనను ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి. తన అనుచరులను కాపాడుకోవడానికి ఆయన మునిసిపల్ ఎన్నికలలో 20 వార్డులలో పోటీకి దిగారు. అందరికి సింహం గుర్తు వచ్చేలా చేసుకున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి పై సానుభూతి పవనాలు వీస్తున్నాయి.

దాదాపు అన్ని స్థానాలలో జూపల్లి సింహం గుర్తు గెలిచే పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కేటీఆర్ కు  ఫిర్యాదు చేశారు.  కేటీఆర్ జూపల్లితో చర్చలు జరిపారు. ఈ సమయంలో జూపల్లి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ప్రజల అభిమానాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

అదే విధంగా ఉమ్మడి జిల్లాలో పట్టుకోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే జూపల్లి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తన అభ్యర్ధుల్ని గెలిపించుకుంటే ప్రజలకు మంచి చేయడమే కాకుండా కొల్లాపూర్ లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకుని ప్రజల అభిమానాన్ని మరింతగా పొందేందుకు అవకాశం ఉంటుంది.

తన అభ్యర్ధులు అందర్ని విత్ డ్రా చేస్తే మాత్రం జూపల్లి ఇక రాజకీయం మానేసి ఇంట్లో కూర్చోవడమో లేదా హైదరాబాద్ కు మకాం మార్చడమో చేయాల్సి ఉంటుంది. కొల్లాపూర్ ప్రజలకు అన్యాయం చేసినట్లు కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జూపల్లి అడ్డు లేకపోతే మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది.

Related posts

భారతీయ కిసాన్ సంఘ్ లో లక్ష సభ్యత్వాలు చేస్తాం

Satyam NEWS

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు

Satyam NEWS

రోడ్డు పనులకు భూమి పూజ

Satyam NEWS

Leave a Comment