37.2 C
Hyderabad
April 26, 2024 20: 40 PM
Slider జాతీయం

లాక్ డౌన్ లోనూ 215 కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పులు

#SupremeCourt of India

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు 215 కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. లాక్‌డౌన్ విధించడానికి రెండు రోజుల ముందే సుప్రీం కోర్టు అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో సుప్రీం విచారించిన కేసుల సంఖ్యకు సంబంధించి తాజాగా గణాంకాలను విడుదల చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్‌‌ 24 వరకు నెల రోజుల సమయంలో సుప్రీం కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  593  కేసులను విచారించింది. నెల రోజుల వ్యవధిలో 87 బెంచ్‌లు 593 కేసులు విచారణ చేపట్టగా, వాటిలో  84 రివ్యూ పిటిషన్లను కొట్టేసినట్లు కోర్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సాధారణ పరిస్థితుల్లో రోజుకు 16 బెంచ్‌లు, నెలకు 3,500 కేసులను విచారణ చేపట్టేవని.. లాక్‌డౌన్‌ సమయంలో రెండు, మూడు బెంచ్‌లు మాత్రమే వర్చువల్‌ కోర్టు రూమ్‌ల ద్వారా అత్యవసర కేసుల విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Related posts

ఎమ్మెల్యే మాటలతో ఎండిపోయిన వేరు శనగ రైతు

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే కాలేరు సన్మానం

Satyam NEWS

గుడ్ గోయింగ్: బిచ్కుందలో 96శాతం పల్స్ పోలియో

Satyam NEWS

Leave a Comment