32.7 C
Hyderabad
April 26, 2024 23: 15 PM
Slider కడప

కాపు కులస్తుల్లో ఐక్యత ఎంతో అవసరం : బోలిశెట్టి శ్రీనివాసులు

#janasena

కాపు కులస్తుల్లో ఐక్యత అవసరమని తాడేపల్లి గూడెం జనసేన ఇంచార్జీ బోలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కళాంజలి గార్డెన్ లో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జీ మాలిశెట్టి వెంకట రమణ ఆధ్వర్యంలో సోమవారం స్వర్గీయ వంగవీటి మోహన రంగా 75 వ జయంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా తో కాపుల సత్తా బయట పడిందని,మనలో మనకు ఐక్యత లేకపోవడమే మన బలహీనత అని అన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన చీడ పురుగులు చేరాయని ఆవేదన చెందారు. వారికి పవన్ లేకపోతే బ్రతుకు లేదని హెచ్చరించారు. వైసీపీలో రెడ్ల ఆధిక్యం ఉందని, టీడీపీలో కమ్మ కులస్తుల ఆధిక్యం ఉందని కానీ వాటిని కుల పార్టీలని అనకుండా జనసేనను కుల పార్టీ అని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం ,మద్యం,పన్నులు విధించి దోచుకుని ఎన్నికల్లో గెలిచేది మేమేనంటూ జగన్ అంటున్నారని ఆరోపించారు. జనసేనలో నాదెళ్ల మనోహర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కాపులకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. తన పై 5 కేసులు పెట్టి స్వంత స్థలాన్ని కబ్జా చేశారని, 24 కోట్లు పోగొట్టు కున్నానని, ఎన్నికల అనంతరం మరో 4 కోట్లు పోగొట్టు కున్నానని తనని పార్టీ అడుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తామని అన్నారు.

రాష్ట్ర తెలుగ,బలిజ,కాపు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ దాసరి రాము మాట్లాడుతూ కాపులు వివిధ పార్టీలో ఉండడంతో కొంత ఐక్యత తగ్గిందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్టాలల్లో వంగవీటి మోహనరంగా 75 జయంతి పండుగలా చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ పార్టీలకి అతీతంగా కాపులంతా ఏకంకావాలని,కాపుల్లో భవిష్యత్ లో పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు ఇక రారని సృష్టం చేశారు.పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని,చెత్త పై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా నేతలు వంగవీటి మోహనరంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాటాల రామయ్య, రాష్ట్ర జనసేన నేతలు ఆకులనరసయ్య, మోదుగుల పెంచలయ్య, అదృష్ట దీపుడు, వెంకటేశ్వర రావు,లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బ రాయుడు, బండ్ల రాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు, ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, తాళ్లపాక శంకరయ్య, డాక్టర్ రామయ్య జనసేన కార్య కర్తలు,జనసేన వీర మహిళలు, జనసైనికులు,తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

Related posts

హిందువుల పట్ల విద్వేషం కక్కుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

నో ఛేంజ్: మహిళా అధికారికి ఎమ్మెల్యే భర్త బెదిరింపు

Satyam NEWS

శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment