Slider కరీంనగర్

ఆడియో మొత్తం వినండి నా తప్పేమీ లేదు

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వ్యవహారంలో తన తప్పేమీ లేదని జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. ఆయనతో తన సంభాషణను ముక్కలు చేసి.. వక్రీకరించారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఎంపీ సంజయ్‌తో కలిసి కలెక్టర్‌ కుట్ర పన్నారంటూ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించిన నేపథ్యంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. సోమవారం సీఎస్‌ ఎస్‌.కె.జోషిని కలిసి వివరణ సమర్పించారు. పూర్తి ఆడియో వింటే వాస్తవాలు తెలుస్తాయంటూ ఆడియో క్లిప్‌ మొత్తాన్ని సీఎ్‌సకు సమర్పించినట్లు తెలిసింది. అయితే సంజయ్‌, కలెక్టర్‌ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, సర్వత్రా దీనిపైనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌పై బదిలీ వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Related posts

తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది.

Satyam NEWS

గుండు సైదులు కుటుంబానికి అండగా శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

చారిత్రక ప్రదేశంగా రాజుల కాలం నాటి అతి పురాతన లింగంబావి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!