28.7 C
Hyderabad
April 27, 2024 03: 22 AM
Slider కరీంనగర్

చిగురుమామిడి రెవెన్యూ సిబ్బందిపై పెట్రోలు దాడి

chigurumamaidi

భూ సంబంధిత వివాదాలు రెవెన్యూ సిబ్బంది ప్రాణాల మీదికి వస్తున్నది. లంచాలకు అలవాటు పడ్డమూ లేక ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లేకపోవడమో తెలియదు కానీ ప్రజలకు మాత్రం పనులు కావడం లేదు. ప్రభుత్వ పెద్దలు చోద్యం చూస్తూ కూర్చున్నారు కానీ క్షేత్ర స్థాయి సిబ్బంది మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో నేడు ‘‘అబ్దుల్లాపూర్ మెట్ తరహా’’ సంఘటన జరిగింది. లంబడిపల్లి కి చెందిన ఒక  రైతు కార్యాలయానికి తిరిగి తిరిగి అలసిపోయి విసిగిపోయి నేడు కార్యాలయానికి వచ్చి అక్కడి కంప్యూటర్లపై , సీనియర్ అసిస్టెంట్ రాజ రామ్ చందర్, అనిత, దివ్య ల పై పెట్రోల్ చల్లిన ఘటన చోటుచేసుకుంది. జీల కనకయ్య అనే రైతు తన భూసమస్య పరిష్కరించడం లేదని అధికారులపై ఆరోపణ. సిబ్బంది, అధికారులపై పెట్రోల్ పడటంతో ఒక్క సారిగా నిర్ఘాంతపోయారు. కార్యాలయంలో పెట్రోల్ చల్లడంతో ఒక్క సారిగా అక్కడి సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి రైతును అదుపులోకి తీసుకున్నారు.

Related posts

ఎన్నికల కోడ్ అమలులో ఉందో లేదో చెప్పగలరా?

Satyam NEWS

టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ డైరీ ఆవిష్కరించిన కెప్టెన్ ఉత్తమ్

Satyam NEWS

ఆంధ్రుల జల దోపిడీ ఆపాలంటూ ఆర్డీవో కు వినతి పత్రం

Satyam NEWS

Leave a Comment